అక్షరాక్షరమందు ఆ సరస్వతి రూపు...

IMG_6211 IMG_6197

Untitled-6128

పెర్త్ తెలుగు బడి
భాషపై మమకారం, సంస్కృతిపై వాత్సల్యం, మన వారన్న గౌరవం, భావితరాలతో బాంధవ్యం, తరతరాల తెలుగు నిత్యమూ అంటూ ఆస్ట్రేలియాలోని పడమటి సంధ్యారాగాలు అక్షర పవనాలుగా వీస్తున్నాయి.  అక్షరాక్షరమందు ఆ సరస్వతి రూపుని పిల్లల చేత దిద్దిస్తున్నాయి.

ముగ్దమనోహరమైన తెలుగు అక్షరాన్ని మూడేళ్ళ వయసు పిల్లల మునివేళ్ళతో ముచ్చటగా దిద్దటానికి రెండేళ్ళ క్రితం అక్షర బడిని ప్రారంభించడం జరిగింది. వచ్చే నెల 19 వ తేదీన పండగగా రెండవ వార్షికోత్సవం జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తుంది.

2015 నవంబరు 22వ తేదీన ప్రారంభించిన తెలుగు బడి మొదట్లో 10 మంది పిల్లలతో మొదలిడి ఇంతింతై వటుడింతై అన్నట్లు ఇప్పుడు షుమారు 42 మంది పిల్లలతో ప్రతీ వారం రెండు ప్రదేశాల్లో అత్యంత ఉత్సాహంతో పెర్త్ తెలుగు సంఘం అధ్వర్యంలో నడుపుతున్నారు.

ఈ తెలుగు బడులు నడవడానికి కొంతమంది (షుమారు 7 మంది) స్వచ్చంద సేవకులు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి అభివృద్ది పధంలో పయనిస్తున్నారు. వీరి కృషికి గాను గత సంవత్సరం వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రభుత్వం వారు $13,000 విరాళంగా కూడా ఇవ్వడం జరిగింది.

తెలుగు సంఘం నిర్వహించే కార్యక్రమాల్లో తెలుగుబడి పిల్లల కోసం ప్రత్యేక అంశాలను తీర్చి దిద్ది వారికీ రంగస్థలంపై ప్రదర్శననివ్వడానికి తప్పకుండా అవకాశం కల్పిస్తుంటారు.

తెలుగుబడి నిర్వహణ  సమర్ధవంతంగా జరగడానికి ఇక్కడ నేర్పించే ఉపాధ్యాయులే కాకుండా ఇతర స్వచ్చంద సేవకులు ఎంతో మంది  కృషి చేస్తూ అంచలంచెలుగా మన భాషా సంస్కృతులను పిల్లలకు బోధించడంలో కృతకృత్యులవుతున్నారు. తెలుగుబడి కార్యక్రమాలను తెలుపుతూ ప్రతీ నెల ఒక న్యూస్ లెటర్ తెలుగు సంఘం సభ్యులందరికీ పంపడం జరుగుతుంది.

Board of Governance Team:
a. Chief Advisor – Smt Dr Rajani Palladi
b. Governance Controller – Shri Dr Venkata Kasina
c. Finance Advisor – Shri Vasant Rajaram

IMG_6056Executive Committee Team:
a. President – Shri Vasanth Kuhaluri
b. Vice President – Shri Sravan Lankapothu
c. Treasurer – Shri Lakshmi Maruthi Venkata Vijay Dasari.
d. General Secretary– Shri Sridhar Chintanoori
e. Assistant General Secretary- Shri Chandra Indurthi
f. Cultural and Religious Events Coordinator – Smt Sampoorna Chilappa
g. Asst Cultural Co-Ordinator – Shri Yenugula Rambabu
h. Website Co-Ordinator – Shri Vijay Kasina

IMG_6099IMG_6107

Send a Comment

Your email address will not be published.