అల వైకుంఠపురములో...

‘అల్లు అర్జున్‌…అల వైకుంఠపురములో..’.కొత్తలుక్‌

Ala-Vaikunthapuramuloఅల్లు అర్జున్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’. ఇటీవల ఈ చిత్రంలోని ‘సామజవరగమన…అనే పల్లవితో సాగే తొలి పాటను విడుదల చేశారు. ఈ పాటకు సోషల్‌ మీడియా భారీ ఎత్తున స్పందన లభించింది. సోమవారం ఈ చిత్రంలో ‘ రాములో రాముల…అనే పల్లవితో సాగే రెండో గీతాన్ని విడుదల చేస్తున్నట్టు ఆ సంస్థ ట్విట్టర్‌ వేదికగా పంచుకుంది. బన్ని మందుతాగి చిందేస్తున్నట్టు కనిపిస్తున్న కొత్తలుక్‌ను కూడా విడుదల చేసింది.

‘అలవైకుంఠపురములో…’ చిత్రంలో మరో పాత్రను ఆదివారం అభిమానులకు పరిచయం చేసింది గీతా ఆర్ట్స్‌. అదే సుశాంత్‌ క్యారెక్టర్‌. ఇందులో ఇతను ‘రాజ్‌’ పాత్రలో కనిపించబోతున్నాడు. ‘ఇతను అందమైన, అహ్లాదకరమైన నవ్వు, అభిరుచి ఎవరినైనా ఆకర్షిస్తుంది’ అని క్యాప్షన్‌ పెట్టింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిన క్రియేషన్స్‌ బ్యానర్లలో తెరకెక్కుతోంది. నివేదా పెతురాజ్‌, టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కాజల్‌ కూడా ప్రత్యేక గీతంలో ఆడిపాడనుంది.

Send a Comment

Your email address will not be published.