'ఆఫీసర్" ఈ నెలలోనే...

నాగ్- ఆర్జీవీ కాంబినేషన్లో ‘ఆఫీసర్” ఈ నెలలోనే విడుదల

officerకింగ్’ నాగార్జున హీరోగా, రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఆఫీసర్‌. గత నెల ప్రథమార్థంలో ఫస్ట్‌ లుక్‌, లోగోతో పాటు తొలి టీజర్‌ను విడుదల చేసి వర్మ.. తాజాగా ఆఫీసర్ 2వ టీజర్‌ను రిలీజ్ చేశారు. చాలా కాలం తర్వాత నాగార్జున మాస్ లుక్‌లో కనిపించడం అభిమానులను ఆకట్టుకునే అంశం. గత కొంతకాలం నుంచి తన స్థాయికి తగ్గ సినిమాలు చేయటంలో ఫెయిల్ అవుతున్న వర్మ నాగ్‌తో చేసిన మూవీలో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

నేరాలు జరగకుండా ఏం చేయాలో పోలీస్ ఆఫీసర్ క్రిమినల్స్ నుంచి నేర్చుకుంటాడు. కానీ ఆ క్రమంలో కొందరు పోలీసులు క్రిమినల్స్‌గా మారతారంటూ వర్మ తనదైన మార్కును రెండో టీజర్‌లో చూపించాడు. ఇప్పటికే ఆఫీసర్‌ షూటింగ్‌ పూర్తైయింది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో, పోలీస్‌ ఆఫీసర్‌, గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. నాగ్‌ కొలీగ్‌గా మైరా సరీన్ నటించారు. తెరంగేట్రం చేస్తున్న అన్వర్ ఖాన్ విలన్‌ రోల్‌ పోషించాడు. ఈ 12న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. మే 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా డైరెక్టర్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. ఇది నాటి ‘శివ’ లా ఆకట్టుకుంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.