ఆస్ట్రేలియాలో శ్రీమతి కవిత జన్మదిన వేడుకలు.

Kavita_Birthday

గౌరవ పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవిత గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని సిడ్నీ, మెల్బోర్న్ ,కాన్బెర్రా , బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో సిడ్నీలో కవిత గారి దీర్ఘాయుష్షు కోసం సిడ్నీ రీజంట్స్ పార్క్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు . సాయంత్రం సిడ్నీలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేష్ రాపోలు మాట్లాడుతూ శ్రీమతి కవిత గారి ఆశీస్సులతో ఆవిర్భవించిన తమ టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా, అనతికాలంలోనే ఆస్ట్రేలియాలోని అన్ని నగరాల్లో కార్యవర్గాల్ని ఏర్పరుచుకొని, వివిధ కార్యక్రమాల్ని నిర్వహించడంతో పాటు, టి ఆర్ ఎస్ పార్టీ గొప్పతనాన్ని ఖండాంతరాల్లో తెలియజెప్పడానికి విశేష కృషినందిస్తుందనీ, తమకీ అవకాశం కల్పించిన కవిత అక్క గారికి సదా కృతజ్ఞులమని తెలిపారు.

కవిత గారు తెలంగాణ జాగృతి ద్వార అందిస్తున్న విశేష సేవలను, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు చేస్తున్న కృషిని కొనియాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణను సాధించే దిశగా తెరాస ఆస్ట్రేలియా పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.

రవి సాయల, సాయి రామ్ ఉప్పు , శ్రీకాంత్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో , కాన్బెర్రా, విక్టోరియా మరియు బ్రిస్బేన్ లో వేడుకలు ఇదే రీతిన ఘనంగా నిర్వహించారు.సిడ్నీ లో జరిగిన వేడుకలలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా కోర్ కమిటి నాయకులూ ప్రవీణ్ పిన్నమ, పరశురామ్ , రవి దూపాటి, లక్ష్మీనారాయణాచార్యులు నల్లాన్, హరికృష్ణ ముదిగొండ , జశ్వంత్ కోదారపు , MB. ఇస్మాయిల్ , అరుణ్ మస్నా, సంగీత దూపాటి(NSW మహిళా విభాగం ఇంచార్జి ), జ్యోతి వాడ్రేవు , స్వాతి నల్లాన్, శీరిష పిన్నమ, శారదా ముతుకుల్లా , విద్య మస్నా మరియు తెరాస నాయకులూ పాల్గొన్నారు.

Send a Comment

Your email address will not be published.