అనుకోని చూపులు
మరచిపోలేని నవ్వులు
దగ్గరవడానికి జంకు
పక్కనున్నా ఏకాంతం
గాయమైనా ఆనందం
అరెరె
ఇది ప్రేమ వల్ల కాదు
కాలేజీలో మొదటి వారపు
అనుభూతి
—————————
నిన్ను ప్రేమించే అమ్మాయిని
ఆఖరి శ్వాస వరకు
మరవకు
నిన్ను మరచిన అమ్మాయిని
జీవితాంతం
తలవకు ..
———————-
జీవితాంతం
తొలి ప్రేమమనతో పయనిస్తుంది
అది తీయనైన బాధ
—————————
నా హృదయాన్ని
అందరూ వొట్టి బండ రాయి అన్నారు
కానీ
నాకు మాత్రమే తెలుసు
అందులో అందమైన శిల్పమై
నువ్వున్నావని
——————————-
కలలో రోజూ
నా చేయిని పట్టే నిన్ను
నిజంలో
ఒక్కసారైనా
నీ చేయి పట్టుకుని
బహుదూరం
నడవాలని నా ఆశ
—————————–
అప్పుడు అన్నీ నచ్చాయి
నువ్వు నాతో ఉండటం వల్ల
కానీ
ఇప్పుడు ఏదీ నచ్చడం లేదు
నువ్వు నన్ను
విడిచిపెట్టి వెళ్లిపోవడంతో…
—————————————–
యామిజాల జగదీశ్