ఈ శతాబ్దంలో మొదటి అష్టావధానం

_DSC5394
_DSC5417
ఇదొక సాహితీ విన్యాసం.  తెలుగు, సంస్కృతంలో కాకుండా మరే ఇతర భాషల్లో లేని ఒక ఉత్కృష్టమైన సమన్వయ సంతుష్టము.  అవధాని యొక్క ధారణా శక్తికి పాండితీ ప్రకర్షకు నిరుపమాన నిదర్సనం.  తెలుగు భాషా వాజ్మయంలో అసాధారణ అద్వితీయ సాహితీ పరిజ్ఞానం.  నిశిద్ధాక్షరి, దత్తపది, సమస్యా పూరణం, పురాణ పఠనం ఇలా ఎన్నో ప్రక్రియలతో కూడుకున్న ప్రవాహం.  ఆస్ట్రేలియాలో ఈ శతాబ్దంలో తొలిసారిగా మరియు మెల్బోర్న్ నగరంలో 20 సంవత్సరాల తరువాత జరిగిన అష్టావధానం.

అవధాన సాహితీ ప్రక్రియపై ప్రత్యేక వ్యాసం ఈ క్రింది వ్యాసంలో చూడగలరు.
https://www.telugumalli.com/news/అవధానం-అపురూప-సాహితీ-ప్ర/
_DSC54221
_DSC54191
అష్టావధాని మరియు పండితులు శ్రీమాన్ మరింగంటి కులశేఖరాచార్యులు గారు మెల్బోర్న్ వాసులైన 8 మంది పృచ్చకులతో ఈ నెల 22వ తేదీన అష్టావధానం నిర్వహించారు.

అంశం పృచ్చకులు
నిషిద్ధాక్షరి శ్రీ ఉమా మహేష్ శనగవరపు
దత్తపది శ్రీ కోటీశ్వర రావు శనగపల్లి
సమస్య శ్రీ వేణుగోపాల్ రాజుపాలెం
వర్ణన శ్రీ ప్రసాద్ పిల్లుట్ల
అప్రస్తుత ప్రసంగం శ్రీ చారి ముడుంబి
పురాణ పఠనం శ్రీ మురళి ధర్మపురి
గంటానాదము శ్రీ సునీల్ పిడుగురాళ్ళ
ఆశు చిత్రలేఖనం శ్రీ రాంప్రకాష్ యెర్రమిల్లి

మెల్బోర్న్ నగరంలోని పలువురు పెద్దలు ఎప్పుడో బాల్యంలో చూసి తరించిన తమ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.  చాలామంది యవ్వనంలో ఉన్న ఈ తరం వారు ఈ ప్రక్రియ ఏమిటో స్వయంగా చూడాలన్న కుతూహలంతో వచ్చి ఆద్యంతం తిలకించి మన భాషలో ఇంతటి విశిష్ట ప్రక్రియ ఉందా అని ముక్కున వ్రేలు వేసుకున్నారు.  ఇటువంటి కార్యక్రమాలు మరింత విరివిగా జరుపుకోవాలన్న ఆకాంక్షను అందరూ వ్యక్తపరచడం ముదావహం.

ఈ సందర్భంగా పృచ్చకులు తాము గత రెండు మూడు వారాలుగా వారి వారి అంశాలను ఔపోసన పట్టి సాహితీపరమైన సమస్యలను శ్రీ అవధానిగారికి ఇవ్వడం జరిగింది.  శ్రీ కులశేఖరాచార్యులు గారు కూడా ఎంతో సమయస్పూర్తితో అన్ని అంశాలను పూరించి పద్యాలు చెప్పారు.

IMG-5265

శ్రీ కులశేఖరాచార్యులు గారు మంచి చిత్రకారులు గనుక వారు “ఆశు చిత్రలేఖనం” ఒక అంశంగా ఈ అష్టావధానంలో ప్రవేశపెట్టడం జరిగింది.

కార్యక్రమానికి ముందుగా శ్రీమతి వెంకటరత్నమ్మ గారు మరియు వారి కుమార్తె శ్రీమతి కృష్ణవేణి గారు సరస్వతీ ప్రార్ధనా గీతం పాడారు.

IMG-20180925-WA0003
IMG_5272
తెలుగు సంఘంలోని ప్రముఖులు శ్రీ ఇందుభూషణ్ పట్నాయికుని గారు అవధాని గారికి శాలువాతో సత్కరించి భువన విజయ సభ్యులు స్రీ సూర్యనారాయణ సరిపల్లె గారు వ్రాసిన జ్ఞాపికను అందజేసారు.

ఈ సందర్భంగా పృచ్చకులందరికీ తెలుగుమల్లి మరియు భువనవిజయం తరఫున కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకున్నారు. ధ్వని బ్రహ్మ శ్రీ మురళి బుడిగె గారు ఎప్పటిలాగానే వారి సహాయాన్ని అందించారు. శ్రీ వడ్డిరాజు గారికి మరియు శ్రీ మురళి గారికి కృతజ్ఞతలు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి హాలులో కుర్చీలు సర్దుబాటులో సహాయం చేసిన శ్రీ శ్రీనివాస్ బృందావనం మరియు శ్రీ మోహన్ పెన్మెత్స గారికి తెలుగుమల్లి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.

చివరిగా ఫోటోలు తీసిన రవితేజ వీరమాచినేని, రాజశేఖర్ రెడ్డి గార్లకు మరియు విడియో సహకారం అందించిన నీలిమ వీరమాచినేని గారికి తెలుగుమల్లి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ తెలుగుమల్లి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.

_DSC5427 _DSC5428

Send a Comment

Your email address will not be published.