ఎన్టీఆర్‌తో భన్సాలీ

ఎన్టీఆర్‌తో భన్సాలీ సినిమా

పీరియాడికల్‌ చిత్రాలు తెరకెక్కించడంలో బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీకి మంచి గుర్తింపు ఉంది. అగ్ర తారలంతా ఆయన దర్శకత్వంలో పనిచేసేందుకు ఎదురుచూస్తుంటారు. ఆయన మాత్రం కథకు తగ్గ నటుల్ని ఎంపిక చేసుకుంటుంటారు. ఇప్పుడు ఆయన దృష్టి టాలీవుడ్‌ అగ్ర నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ మీద ఉందని బాలీవుడ్‌ సమాచారం. పౌరాణిక పాత్రలు వేయడంలో తారక్‌ సిద్ధహస్తుడనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంజయ్‌ ప్రస్తుతం అలియా భట్‌ ప్రధాన పాత్రధారిగా ‘గంగూభాయి’ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక పౌరాణిక నేపథ్యంలో ఓ చిత్రం చేసే ఆలోచనలో ఉన్నారట. నాయకుడుగా ఎన్టీఆర్‌ని తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు తారక్‌. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో మరో చిత్రం ఖరారు చేశాడు.

Send a Comment

Your email address will not be published.