"ఐ" అదరగొడుతోంది

"ఐ" అదరగొడుతోంది

రొమాంటిక్ థ్రిల్లర్

ప్రముఖ దర్శకుడు శంకర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఐ చిత్రం గురించే ఇప్పుడు చర్చలు…విక్రం, అమీ జాక్సన్ తదితరులు నటించిన ఐ చిత్రానికి నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్. సంగీతం ఏ ఆర్ రెహమాన్.

రొమాంటిక్ థ్రిల్లర్ కథకు సైన్సు, టెక్నాలజీ మేళవించి దర్శకుడు శంకర్ సమర్పించిన  ఈ సినిమాలో విక్రమ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడు.

ఎలాగైనా ఒక జిమ్ కేంద్రం ఏర్పాటు చేసి మిస్టర్ ఇండియన్ బాడీ బిల్డర్ అనే టైటిల్ సొంతం చేసుకోవాలని పరితపించే దిశలో అందుకు అవసరమైన రీతిలో కృషి చేసే  గెలుచుకోవాలనే కోరికతో లైఫ్ ని సాగించే విక్రం తోలి అడుగుగా  మిస్టర్ ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డర్ అనిపించుకుంటాడు. అయితే అతనికో బలహీనత ఉంది.  ఒక టాప్ మోడల్ గా ఉన్న అమీ జాక్సన్ని తెగ ఇష్టపడి ఆరాధిస్తుంటాడు.  మరోవైపు  ఈ మోడల్ ని మోడల్ ఒకడు అనేక విధాలుగా  వేధిస్తుంటాడు. అతను పెట్టే ఇబ్బందుల నుంచి కాపాడుకోవడానికి ఆమె  ఒక డాక్టర్ ద్వారా  విక్రం ని కలుస్తుంది.  తనను కాపాడమని అడుగుతుంది. అనుకోని స్థితిలో వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. పెళ్ళి చేసుకోవాలనుకుంటారు.

ఇంతలో విక్రం కు జబ్బు బారిన పడతాడు.  ఆ జబ్బుతో అప్పటిదాకా అతనికున్న అందం పోతుంది. వికార రూపం వస్తుంది.  అతను ఎందుకలా అందవిహీనుడు అయ్యాడు? అందులో ఎవరి పాత్ర ఉంది?  ఆ తర్వాత కథ ఎన్ని మలుపులు తిరిగింది వంటివి తెలుసుకోవడానికి ఐ సినిమా చూడాలి.

ఈ సినిమాకు మేకప్ టెక్నాలజీ అమోఘం.  విజువల్స్ గురించి వేరేగా చెప్పక్కరలేదు.

విక్రమ్ నటన బాగుంది. ఈ  ప్రేమ కథా చిత్రంలో విక్రం సరసన నటించిన  అమీ జాక్సన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యముంది.

ఈ సినిమా పై తెగ చర్చ జరుగుతున్నప్పటికీ ఏమేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Send a Comment

Your email address will not be published.