సనాతన ధర్మం, వేదాలను
క్రతువు, నైవేద్యాల పరిమితిచేసి
భుజించి, మనుషుల నెల్ల విభజించి
నీతిని
మా తాత ముత్తాతల మూతులకు
పరిమితంచేసి, పురాణ ఇతిహాసాలలో
కొందరిని కోతుల, అసురులచేసి
అవినీతిని
పురోహితుల పద్యశ్లోకాల్లోనే పంచి
మాకందరికవి జీవిత పాఠాలుగజేసి
అమ్మ ఒడిలో, బడిలో, గుడిలో, నడవడిలో
మము మార్చి ఏమార్చేసి
తమ భుక్తికై, మనుగడకై
కడు యుక్తిగా కుయుక్తితో
సనాతనమైన వేదధర్మాలను
వివరణ, విస్లేషణల వివరించక
యుగ ధర్మాలవని, వక్రీకరించి
ఈ కలియుగంలో
కర్మ సిద్ధాంత ఫలంగా వెలసిన అవతారం
అన్నింటా వెలసిన అవినీతిదెయ్యమే దేవుడని
ఎందరికి తెలుసు? ఎవరొప్పుకుంటారు ?
మనది కాకపోతే .. ఎంత దూరమైతేనేం?
అన్న జానపద సామెత చందంగా !
స్వార్ధం నిత్యావసర వస్తువులా పెరిగిపోయి
మనిషిని మనిషి పీక్కుతినే స్థాయికి
సమాజం దిగజారిపోయిన పరిస్థితుల్లో
ఏంచేద్దాం? ఇది మా కర్మ
అని సరిపెట్టుకొనే కలియుగ ధర్మానికి
వ్యతిరేకంగా విల్లు ఎక్కుపెట్టిన బాణంలా
దూసుకువస్తున్నాడు ..అడుగో…అతడే
“క్రేజీ వాల్” మన కేజ్రీవాల్
అరాచక రాజకీయ రణరంగమైన
చదరంగంలో పేదవాని పక్షమై
వెలుతురు, వెన్నెల కురిపించే
సూర్యు చంద్రులు ఒక్కడై వెలిసి
అందరివాడై, ఆమ్ఆద్మీ రధసారధుడై
అవినీతి పాలిట అరివీర భయంకరుడై
అందరికీ ఆప్తుడైన, మనందరి అరవిందుడు
రండి …కదలిరండి… దండుగా..
కుల, మత, ప్రాంతాలకతీతంగా, మన దేశానికి
దశ, దిశ నిర్దేశించే నిబద్దత కూడిన నిర్ణయంతో
ప్రతినబూని, దేశ ప్రగతి.. జాగ్రుతికై