క్లిక్ ఫర్ విక్

క్లిక్ ఫర్ విక్

స్థానిక వ్యాపార సంస్థలను, ఉద్యోగాలను ఆదరించాలని విక్టోరియన్ ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ పిలుపు

ఇంటిలో సురక్షితంగా క్షేమంగా ఉంటూ స్థానిక వ్యాపార సంస్థలు, పంటలు, ఉత్పత్తి, మరియు ఉద్యోగాలకు సహాయం అందివ్వడానికి క్రొత్త పథకం ద్వారా ప్రచారం మొదలుపెట్టారు.

విక్టోరియా రాష్ట్రంలో స్థానికంగా పంటలు పండించే రైతులు, వ్యాపార సంస్థలు, ఇతర వృత్తుల ద్వారా వస్తువులు తయారీ చేస్తున్నవారికి చేయూతనివ్వడానికి ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ ‘Click for Vic’ అన్న క్రొత్త పథకం ప్రారంభించారు.

విక్టోరియా రాష్ట్రం ప్రపంచ స్థాయి ఆహార పదార్థాలు, మద్యం, మధిర రసాలు, ఇంటి సామగ్రి, హస్త కళలు తయారుచేయటంలో దిట్ట. అయితే కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది వివిధ రకాలుగా దెబ్బతిన్నారు.

విక్టోరియా రాష్ట్ర ప్రజలందరికీ క్రొత్త అంతర్జాల గూడు (వెబ్సైటు) ద్వారా స్థానిక సంస్థలను ప్రోత్సహించే విధంగా తోడ్పడాలని టెలివిజన్, ప్రచురణ పత్రికలు, రేడియో, డిజిటల్ మరియు సామాజిక మాధ్యమాలను ఉపయోగించి అర్ధించాలని పథకాన్ని రూపొందించారు.

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రోజువారీ కరోనా బాధితుల సంఖ్య తగ్గుతున్నా, ప్రపంచమంతా సరియైన మందు లేక ఎలా విలవిలలాడిపోతుందో గమనిస్తే, దీర్ఘకాలికంగా మనతో ఉండబోతున్న ఈ అంటురోగ భయందోళనలతో సహవాసం తప్పదనే అనిపిస్తుంది. దీని అర్ధం ఏమిటంటే బయటకు వెళ్ళినపుడు మాస్క్ వేసుకోవడం, చేతులు బాగా శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం – ఏవైనా రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవడం వంటి పనులు కొంత కాలం మనల్ని వెంటాడుతుంటాయి.

అయినా మన విక్టోరియా రాష్ట్రంలో చిన్న వ్యాపార సంస్థలు, పంటలు పండించే రైతులు, హస్తకళల నిపుణులు – వీరందరినీ ఆదరించడానికి మనం క్రొత్త దారులు వెదకాలి.

‘క్లిక్ ఫర్ విక్’ తో వీరందరినీ ఒకే చోట కలుసుకోవచ్చు. వీరిలో ముఖ్యులు – Victorian Country Market, Providoor, Co-Lab Pantry కాకుండా ఇంకా ఎన్నో ఉన్నాయి.

ఈ ప్రక్రియలో కొన్ని ఉత్తమమైన సంస్థల్ని ప్రముఖంగా పేర్కొనడం జరుగుతుంది. వాటిలో ముఖ్యమైనవి – Sallie Jones of Gippsland Jersey, Nathan Cowan of Billson’s Brewery, Beechworth మరియు Gabrielle Moore of Sailors Grave Brewing, Orbost.

Victorian Country Market – ఇది మీకు ఇష్టమైన దేశీయ డిజిటల్ (అంకాత్మక) కథనం. ఇందులో 250 దుకాణాలుంటాయి. వీటిలో విక్టోరియాలోని వివిధ ప్రాంతాలలో లభ్యమయ్యే శుద్ధమైన కూరగాయలు, మద్య పానీయాలు, హస్తకళలు, గృహోపకరణాలు దొరుకుతాయి. ఈ విధంగా ప్రాంతీయ విక్టోరియా కళాకారులకు, సన్నకారు రైతులకు ఆర్ధిక సహాయం అందించడమే కాకుండా సంగీత కళాకారులకు కూడా ఇంటివద్ద బట్వాడా ద్వారా అవకాశం కల్పిస్తుంది.

Providoor – మెల్బోర్న్ చెఫ్ షేన్ డేలియాచే స్థాపించబడిన ఈ సంస్థ నగరంలోని ఉన్నతమైన రెస్టారెంట్లుతో చేతులు కలిపి ఇంటిలోనే పూర్తిగా తయారుచేసిన ఆహార పదార్ధాలను బట్వాడాచేయు విధంగా ప్రతిపాదన రూపొందించారు. ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టిన Co-Lab Pantry వివిధ ఉపాహారశాలలు, బార్లు నుండి వంటకాలకి ప్రధానమైన ముడిసరుకులు, భోజనాలు, మద్యపానీయాలు వంటి వాటిని సరఫరా చేస్తున్నారు.

విక్టోరియా ప్రభుత్వం ప్రవేశపెట్టిన $1.5 మిలియన్ డాలర్ల అంతర్జాల వాణిజ్య సముదాయం ద్వారా రైతులకు, ఉత్పాదకులకు శిక్షణ సహాయ నిర్వహణీయ కార్యక్రమాలకు ఎంతో మేలు చేస్తుంది.

visitvictoria.com/clickforvic – అందరూ ఈ లంకెలోనున్న సమాచారాన్ని తెలిసికొని విక్టోరియా రాష్ట్రంలో దొరుకుతున్న అనేకరకమైన వస్తువులను స్వంత ఇంటికి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి.

Send a Comment

Your email address will not be published.