ఖైదీగా వస్తున్న కార్తీ

ఖైదీగా వస్తున్న కార్తీ

Khaidiకార్తీ కథానా యకుడిగా రూపొందిన చిత్రం ‘ఖైదీ’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ అందిస్తున్నారు. ఈనెల 25న కానున్న నేపథ్యంలో కార్తీ మీడియాతో మాట్లాడారు.
లోకేష్‌ కనకరాజ్‌ షార్ట్‌ ఫిలిమ్స్‌ చేసి ఇండిస్టీకి వచ్చారు. ఫస్ట్‌ మూవీతోనే చాలా పెద్ద హిట్‌ అందుకున్నారు. ఈ కథ చెప్పేటప్పుడే ఇదొక కొత్త ఐడియా. డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది ఒకసారి వినండి అని చెప్పారు. సినిమా మొత్తం మాస్‌గా ఉంటుంది. యాక్షన్‌ కూడా ఎక్కువే ఉంటుంది. ఒక రాత్రి నాలుగు గంటల్లో పూర్తి సినిమా ఉంటుంది. ఆ నాలుగు గంటల్లోనే చాలా సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. దీన్ని ఒక భారీ బడ్జెట్‌ సినిమాగా తీస్తే తప్పకుండా సక్సెస్‌ అవుతుంది అనిపించింది. అలా ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయింది.

ఈ సినిమాకు సంబంధించి మేము కొందరు ఖైదీలను కలిశాం. డైరెక్టగా వారిని కలిసినప్పుడు చాలా కొత్త కొత్త విషయాలు చెప్పారు. చాలా కాలం జైలులో ఉన్న ఖైదీలు బయటకొచ్చి వైట్‌ కలర్‌ చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పారు. మొత్తం 60 రాత్రులు షూట్‌ చేశాం. ఈ సినిమా తీసిన తర్వాత డైరెక్టర్‌ విజరుతో కొత్త చిత్రం చేస్తున్నా. ఇప్పటివరకూ నేను చేసిన వారంతా టాలెంటెడ్‌ డైరెక్టర్స్‌. ఈ సినిమా తర్వాత జీతూ జోసెఫ్‌తో ఒక ఫ్యామిలీ థ్రిల్లర్‌ చేస్తున్నాను. దానిలో మా వదిన జ్యోతిక కూడా నటిస్తున్నారు.

ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం నా క్యారెక్టరైజేషన్‌. పది సంవత్సరాల జైలు జీవితం ముగించుకొని బయటకొచ్చే ఒక ‘ఖైదీ’ క్యారెక్టర్‌. తాను ఇప్పటివరకూ చూడని ఒక కూతురు ఉంటుంది. తను ఎలా ఉంటుందో కూడా తెలీదు. అన్ని అవాంతరాలనూ దాటుకొని తన కూతురిని చూడగలిగాడా? లేదా? అనేది కథ. ఇదొక బిగ్‌ యాక్షన్‌ ఫిలిం. పది సంవత్సరాలు తన కూతురిని చూడలేదు అంటే నాకు కూడా పెర్ఫామెన్స్‌ చేయడానికి స్కోప్‌ ఉంటుంది అనిపించింది. నాకు ఒక కూతురు ఉండడం వల్ల నాన్నగా నటించడం ఈజీ అయింది. నేను గతంలో ‘విక్రమార్కుడు’ మూవీని తమిళ్‌లో రీమేక్‌ చేసేటప్పుడు నాకు ఒక కూతురు ఉంటే ఇలా ఉంటుంది అని ఊహించుకొని నటించాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి సమస్య ఏమీ లేదు.

Send a Comment

Your email address will not be published.