'ఖైదీ' డైరెక్టర్‌ తో మహేష్‌ బాబు!

'ఖైదీ' డైరెక్టర్‌ తో మహేష్‌ బాబు!

‘ఖైదీ’ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్ దర్శకత్వంలో మహేష్‌ బాబు!

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఈ ఏడాది సంక్రాంతి విజయాన్ని సొంతం చేసుకున్నారు మహేష్‌ బాబు. ఈ సినిమాతో దాదాపు వంద కోట్ల క్లబ్‌లో చేరిన మహేష్‌ ప్రస్తుతం యంగ్‌ డైరెక్టర్‌ పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థపై వ్యంగ్యాస్త్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇదిలా వుంటే మహేష్‌ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్టు తెలిసింది. కార్తి హీరోగా నటించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’లో హీరోయిన్‌ లేకుండా, హీరోని సినిమా మొత్తం కేవలం ఒకే ఒక్క డ్రెస్‌లో.. అదీనూ చిరిగిపోయిన షర్ట్‌, లుంగీలో చూపించిన తీరు, కథ, కథనం, గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే, కార్తీ నటన వెరసి ‘ఖైదీ’ చిత్రాన్ని ట్రెంట్‌ సెట్టర్‌గా నిలిపింది. ఈ సినిమాతో లోకేష్‌ కనకరాజ్‌ అనే యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ పరిచయమయ్యారు. ప్రస్తుతం హీరో విజరుతో ‘మాస్టర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న లోకేష్‌ కనకరాజ్‌తో సినిమా చేయాలని మహేష్‌ ఫిక్స్‌ అయినట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుందట. ఇప్పటికే మహేష్‌తో మైత్రీ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Send a Comment

Your email address will not be published.