గాలిపటం ఆకట్టుకుంటుంది

గాలిపటం ఆకట్టుకుంటుంది

“గాలిపటం ఓ వినూత్న కథాంశం. సమాజాన్ని ప్రతిబింబించే చిత్రం. ఇందులో ఓ ఫిలసాఫికల్ టచ్ ఉంది…”

ఈ మాటలు గాలిపటం కథానాయకుడు ఆది చెప్పినవే. ఈ చిత్రం ఆగస్ట్ ఎనిమిదో తేదీన విడుదల అయ్యింది.

గాలిపటం చిత్రంలో క్రిస్టినా, ఎరికా ఫెర్నాండెజ్ ప్రధాన నాయికలుగా నటిస్తున్నారు. చిత్రంలో రెండు లేడీ క్యారక్టర్స్ ఉన్నప్పటికీ ఇది ముక్కోణపు లవ్ స్టోరీ కాదని ఆది అన్నారు.

కథాపరంగా సినిమాలో ఉన్న నా రెండు షేడ్స్ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ నీ, యువతనూ తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం నాకుందని, సినిమా బాగా వచ్చిందని ఆది చెప్పారు.

కొత్త తరహాలో తీసిన ఈ చిత్రం విజయం సాధిస్తుందనే ఆశ తనకుందని కూడా చెప్పిన ఆది ఓ సాఫ్ట్ వేర్ ఆఫీసులో జరిగే సన్నివేశాలను దృష్టిలో పెట్టుకుని వాటికి హాస్యం ప్రతిబింబించేలా దర్శకులు కథను మలచిన తీరు గొప్పగా ఉందని అన్నారు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ వల్ల చోటు చేసుకునే అభిప్రాయాల తేడాలు బాగా ప్రొజెక్ట్ అయ్యాయని అన్నారు.

సమాజంలోని ప్రజలు గాలిపటానికి దారంలాంటి వారని ఆయన చెప్పుకొచ్చారు. ఆ ప్రాధాన్యాన్ని సినిమాలో స్పష్టంగా చూడవచ్చన్నారు.

బాలీవుడ్ లో వచ్చిన కాక టైల్, బాండ్ బాజా బరాత్, ఆషికి 2 లాగా గాలిపటం కూడా ఒక ప్రేమ కథ అని తెలిపారు.

క్రిస్టినాను తాను ముద్దుపెట్టుకున్న సన్నివేశం కథాపరంగా చిత్రంలో ఎంతో అవసరమైనదని, ఈ సన్నివేశాన్ని తాము పబ్లిసిటీలో చూపడానికి ప్రధాన కారణం ఈ చిత్రాన్ని ఎంతో ధైర్యంగా తీసేమని చెప్పడానికే తప్పించి, ఆ సన్నివేశంతో ఏదో లాభపడాలనో, సంచలనం సృష్టించడానికో కాదని ఆది చెప్పారు. ముద్దుపెట్టుకోవడం తమ పనిలో ఒక భాగమేనని అంటూ ముద్దు సన్నివేశాన్ని ఆది సమర్ధించుకున్నారు.

క్రిస్టినా ఓ రష్యన్ గర్ల్ అని, ఆమె రోల్ సినిమాలో ఎంత బలమైనదని, సినిమాలో ఆమె తండ్రి ఒక రష్యన్ అని, తల్లేమో తెలుగుదని ఆది అన్నారు.

తాను నటించిన రఫ్ చిత్రం వచ్చే నెలలో విడుదల అవుతుందని, మరో సినిమా చెయ్యడానికి ఒప్పందం కుదిరినట్టు ఆది తెలిపారు.

Send a Comment

Your email address will not be published.