జనవరి 25న 'మణికర్ణిక'

జనవరి 25న వస్తున్న ‘మణికర్ణిక’

Manikarnikaబాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం మణికర్ణిక. టాలీవుడ్ దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన ఈ సినిమాకు కొంత భాగం కంగనా కూడా దర్శకత్వం వహించారు. అనేక వివాదాలు, మరెన్నో వాయిదాల తరువాత షూటింగ్ పూర్తి చేసుకున్న మణికర్ణిక ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సినిమాను జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్‌ 18న ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. దర్శకుడు తెలుగు వాడు కావటంతో పాటు చారిత్రక కథ కావటంతో ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. హిందీతో  పాటు ఇతర భాషల్లోనూ జనవరి 25నే మణికర్ణికను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. జనవరి 24న క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు రిలీజ్‌ కానుంది.

Send a Comment

Your email address will not be published.