జానపదంలో శృంగార గేయాలు

జానపదంలో శృంగార  గేయాలు

జానపద సాహిత్యంలో శృంగార రచనలు చాలా ఉన్నాయి. ఆ జానపదాలు అభిరుచులను బట్టి ఈ పాటలలో శృంగార భావాలుగా పొందుపరిచారు. వీటిలో ఉన్నత ప్రమాణాలలో ఉండే శిల్పం, అలంకారాల కోసం చూడటం సరి కాదు. శిష్ట సాహిత్యంలో సీతారాముల ప్రణయం ఎంతో గొప్పగా వర్ణించారు. జానపద గీతాలలో సీతారాముల శృంగార రసం అతి సులభంగా అర్ధమయ్యేలా ఉంటుంది.
ఈ భావాలన్నీ ఆయా పాత్రలకు కాకుండా పాటలు రాసిన వారి కోణంలో చూడాలని చెప్పే వారున్నారు. కొన్ని జానపద గేయాలలో ప్రేమకలాపాలు, సాంఘిక నియమ ఉల్లంఘనలు పరస్పర ఆకర్షణలు కనిపిస్తాయి.
అయితే వీటిలో కొన్నింటిలో నలుగురూ మెచ్చుకునేలా శృంగారాలతో కూడిన గేయాలు కనిపిస్తాయి. జనపదాలలో ముఖ్యంగా జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించడం జరుగుతుంది. ఏదో పదాల డాంబికం కోసం పాత్రలకు మెరుగు పెట్టడం కనిపించదు. జానపదాలలోని వైవిధ్యం కళ్ళముందే ప్రత్యక్షం అవుతుంది. దాపరికం ఉండని సాహిత్యం.
అందుకే ప్రేమ శృంగారాలలో వికసించే గేయాలు అనేకం జానపద సాహిత్యంలో చూడవచ్చు.
ఊర్మిళ దేవి నిద్ర, సీతమ్మవారి అలక, సీతమ్మ వారి వేవిళ్ళు, సీతమ్మ ఆనవాళ్ళను ప్రతిబింబించే జానపద పాటలు ఉదాత్తమైన ప్రేమను చదువరి ముందు ఉంచుతాయి.
రుక్మిణి దేవి ముచ్చటలు, చిలుక రాయబారం, సత్యభామ సరసం వంటి జానపద గేయాలు చదువుతుంటే నేరుగా చూస్తున్నట్టు ఉంటాయి.
అలాగే ప్రేమగీతకు సిరిసిరిమువ్వ పాట, కాముని పదాలు, గోంగూర పాట, చల్మోహన రంగ పాట, నారాయణమ్మ పాట వంటివి మంచి ఉదాహరణలు.
జానపద పాటలలో అద్భుత రసం పండించే తీరు అమోఘం.

Send a Comment

Your email address will not be published.