జూన్‌లో ‘లక్ష్మీబాంబ్‌’

జూన్‌లో విడుదలవుతున్న ‘లక్ష్మీబాంబ్‌’

కరోనా వైరస్‌తో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ముఖ్యంగా వేసవి వచ్చిందంటే చిత్రసీమకు పండుగే. అలాంటి ఈ సీజన్‌లో కరోనా వైరస్‌ కారణంగా సినిమా థియేటర్లో మూతబడ్డాయి. ఇప్పట్లో మళ్లీ సినిమా థేయేటర్లు తెరుకుంటాయంటే సరైన సమాధానం లేదు. అందుకే చాలామంది చిత్రనిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సిద్ధమైయ్యారు. తాజాగా అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న ‘లక్ష్మీబాంబ్‌’ చిత్రం కూడా జూన్‌లో డిస్నీ, హాట్‌స్టార్ల్‌లో ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. గత కొంతకాలంగా చిత్ర నిర్మాతలు అక్షయ్‌ కుమార్, విజయ్‌ సింగ్, తుషార్‌ కపూర్‌లు వీడియో కాల్స్‌ ద్వారా చర్చించుకున్న తరువాత ఇలాంటి కొత్త నిర్ణయానికి వచ్చినట్లు సినీ వర్గాలనుంచి వచ్చిన సమాచారం. సినిమాకి సంబంధించి కొన్ని పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయట. అవి కూడా పూర్తి చేసి సినిమాను జూన్‌లోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అంతా సవ్యంగా ఉంటే మే 22, 2020న థియేటర్లలో విడుదల అయ్యేది. తమిళంలో వచ్చిన ‘ముని 2: కాంచన’ చిత్రానికి ‘లక్ష్మీబాంబ్‌’ రీమేక్‌ చిత్రం. రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్, కథానాయికగా కియార అడ్వాణి నటిస్తున్నారు. కేఫ్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్, ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్, మరికొన్ని సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తుషార్‌ కపూర్, తరుణ్‌ అరోరా, అశ్విన్‌ కేల్కర్‌ తదితరులు నటిస్తున్నారు

Send a Comment

Your email address will not be published.