టూకీగా - కబుర్లు...

టూకీగా - కబుర్లు...

సిమ్రాన్ ప్రవేశమిట్లా జరిగింది….

—————————————
నటి సిమ్రాన్ ముంబైలో ఒక కాలేజీలో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసుకుని మోడలింగ్ లో అడుగుపెట్టిన రోజులవి. ఆమె పంజాబీ అమ్మాయి. అసలు పేరు రిషీబాలా. హిందీ బుల్లితెరపై సూపర్ హిట్టైన ముకాబులా అనే కార్యక్రమంతో బాగా పాపులర్ అయిన రిషీబాలాకు సిమ్రాన్ అని కొత్త పేరు పెట్టి తేరే మేరే సప్నే అనే సినిమాలో నాయిక పాత్రలో నటించే అవకాశం కల్పించింది మరెవరో కాదు…..అక్షరాలా బిగ్ బీ అమితాబ్ బచ్చన్. చెన్నైలో ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మలయాళం హీరో మమ్ముట్టి సిమ్రాన్ ను చూసి తన జోడీగా ఇంద్రప్రస్థం అనే సినిమాలో నటించే అవకాశం కల్పించారు. అలా ఇలా ఆమె సినీ జీవితం ముందుకు సాగింది.

—————————————————

నటి ఇలియానా ప్రేమ పలుకులు

నటి ఇలియానా ఆస్ట్రేలియాకు చెందినా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ ని ప్రేమిస్తోంది.

ట్విటర్ లో వీరిద్దరి మధ్య సాగిన ప్రేమ సంభాషణ చూద్దాం…
ఆండ్రూ : బాగా వంట చేసే అబ్బాయిలంటే అమ్మాయిలూ ఎక్కువగా ఇష్టపడతారు. ప్రేమిస్తారు.
ఇలియానా : నేను నిన్ను ప్రేమించడంలో అతిశయోక్తి ఏముంది?
ఆండ్రూ : నాకు నీ ప్రేమ ఒక లాటరీ. ఐ లవ్ యూ.
ఇలియానా : హ్యాపీ బర్త్ డే డార్లింగ్. నేను ఈ సమయంలో నీతో నీ పక్కనే ఉండిఉంటే ఎంత బావుండేదో కదూ ?

——————————

బిపాసా బసు ప్రేమ

“నేనూ, హర్మాన్ బవేజా ప్రేమికులమే. నాకన్నా ఓ ఉన్నతమైన వ్యక్తిని కనుగొన్నాను. నేను అదృష్టవంతురాలిని. ఇచ్చిపెట్టుకున్నదానిని” అని బిపాసా బసు ఊరంతటికీ తెలిసేలా తమ ప్రేమ వ్యవహారాన్ని చెప్పుకుంది.

ఆమె కుడి చేతి వెలికి కొత్త ఉంగరం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమెకు నిశ్చితార్ధం కూడా అయినట్టు బాలీవుడ్ లో ఒకటే మాట .

————————————

హేట్ స్టోరీని బ్యాన్ చేయండి

హేట్ స్టోరీ 2 సినిమాను బ్యాన్ చెయ్యాలి అని అసెంబ్లీ వరకు వెళ్ళిన విషయంతో బాలీవుడ్ లో కలకలం. ఇంతకూ ఎందుకు ఈ సినిమాని బ్యాన్ చెయ్యాలో అని కర్నాటక శాసనసభలో ఒక ఎమ్మెల్యే గట్టిగానే చర్చకు తెర తీసారు. ఈ చిత్రంలో ముద్దుల సీన్లు, పడక గది సీన్లు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయని సదరు ఎమ్మెల్యే రభస చేసారు. ఇలాంటి సన్నివేశాలు మహిళలపై లైంగిక వేధింపులకు ఉసి గొలిపే విధంగా ఉన్నాయని, కనుక ఈ చిత్రాన్ని వెంటనే బ్యాన్ చెయ్యవలసిందేనని ఆయన తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.

——————————–

దీపిక సంస్కారం

ఇటీవల కత్రినా కైఫ్ పుట్టినరోజు జరుపుకుంది.

అప్పుడు తమాషా చిత్ర షూటింగ్ స్పాటుకి రావలసిందిగా రణబీర్ కపూర్ పాత ప్రేయసి దీపికా పడుకోనేకు కాల్ చేసాడు. అతని మాట కాదనలేక సరేనని దీపిక బయలుదేరి వెళ్ళింది. అయితే ఆ షూటింగ్ స్పాట్ లో కత్రినా కైఫ్ పుట్టినరోజు వేడుకలు జరిపితే దీపిక మరోలా ఫీల్ కావచ్చని అనుకుని రణబీర్ కపూర్ వెంటనే కత్రినా కైఫ్ ని మరో చోటికి తీసుకు వెళ్లి ఏకాంతంలో పుట్టినరోజు సంబరాలు జరిపాడు. ఈ విషయం తెలిసినా దీపికా రచ్చ చేసో బాధ పడో మాటలు అనేస్తే మంచిది కాదనుకుని సంస్కారవంతంగా ఆలోచించి కత్రినా కైఫ్ కి హ్యాపీ బర్త్ డే విషెస్ చెప్పి వెళ్ళిపోయింది. రణబీర్ కపూర్ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.

Send a Comment

Your email address will not be published.