ట్విట్టర్ లో టాప్

ట్విట్టర్ లో టాప్

ట్విట్టర్ లో మహేష్‌ బాబు టాప్

తెలుగు చిత్రసీమలో ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు ఇప్పుడు మరో రికార్డు సాధించాడు. ట్విట్టర్లో ఎక్కువమంది అనుసరగణాన్ని కలిగిన దక్షిణాది హీరోగా స్థానం సంపాదించాడు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్న కథానాయకుల్లో మహేష్‌బాబు ఒకరు. గత కొన్నాళ్లుగా లాక్‌డౌన్‌ పాటిస్తూ ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సయమంలో ఆయన ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ అభిమానులకు దగ్గరయ్యారు. అంతేకాదు కరోనా వైరస్‌ నియంత్రణకు పాటించాల్సిన సూచనలు ఎప్పటికప్పుడు తన ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం మహేష్‌కి ట్విట్టర్‌లో 10 మిలియన్స్ అంటే కోటి మంది ఫాలో అవుతున్నారు. మిల్కీ మహేష్‌బాబుతో పోల్చుకుంటే దక్షిణాదిలో ఇలాంటి ఘనత ఏ మిగతా హీరోలకు దక్కలేదు. జాతీయ నటుడు కమల్‌హాసన్‌, మరో నటుడు రజినీకాంత్‌కి ట్విట్టర్లో ఇంతమంది ఫాలోవర్స్ లేరు. ప్రస్తుతం మహేష్‌ ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతుంది. ఇప్పటికే మహేష్‌కు జోడీగా కనిపించబోయే నాయికను ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం కియారా అడ్వాణీ, పూజాల పేరు వినిపించినప్పటికీ.. ఆ అవకాశం కీర్తి సురేష్‌ని వరించింది.

Send a Comment

Your email address will not be published.