డబ్బులు తీసుకోలేదు

డబ్బులు తీసుకోలేదు

శర్వానంద్ హీరోగా నటించిన రన్ రాజా రన్ సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి దర్శకుడు సుజీత్.

శర్వానంద్ మాట్లాడుతూ, క్రితం చిత్రాలకన్నా ఈ సినిమాలో తన పాత్ర భిన్నమైనదని, అదొక మాస్ రోల్ అని చెప్పారు. ఈ చిత్రాన్ని ఒక పరీక్షగా అనుకుని చేసినట్టు ఆయన తెలిపారు. ఈ చిత్రంపై తన నటనకు మంచి మార్కులే వచ్చాయని, కనుక తాననుకున్న పరీక్షలో ప్యాస్ అయినట్టే ఫీల్ అవుతున్నానని అన్నారు.

ఈ చిత్రంలో తన పాత్ర ఒక మాస్ రోల్ అని దర్శకుడు, నిర్మాతలు చెప్పినప్పుడు మొదట్లో కాస్తంత తటపటాయించానని, ప్రేక్షకులు తనను ఆదరిస్తారా అని ఆలోచనలో పడ్డానని చెప్పారు. అయితే దర్శకుడు, నిర్మాతలు తనను ఎంతగానో ప్రోత్సహించారని, అందుకే అన్నీ సవ్యంగా సాగాయని శర్వానంద్  అన్నారు. చిత్రానికి విశేష ఆదరణ లభించడం వల్ల తన మీద దర్శకుడు, నిర్మాతలు పెట్టుకున్న నమ్మకం వృధా కాలేదని, అందుకు ఆనందంగా ఉందని ఆయన చెప్పారు.

దర్శకుడు సుజీత్ వయస్సు 24 సంవత్సరాలని, అతను చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశానని, అవి తనకు ఎంతగానో నచ్చాయని, ఈ చిత్రంలో అతని టీం వర్క్ బాగుందని శర్వానంద్ అన్నారు.

ఈసినిమాకు తాను డబ్బులు తీసుకోలేదని, నిర్మాతలు తనకు అత్యంత సన్నిహితులని, తమ మధ్య చర్చల్లో అసలు డబ్బులు విషయం ప్రస్తావనకు రాలేదని చెప్పారు.

సినీపరిశ్రమలో తనకు చరణ్, నితిన్, నరేష్, మనోజ్, నాని మంచి మిత్రులని ఆయన తెలిపారు.

రన్ రాజా రన్ లాంటి ఈ చిన్న చిత్రాన్ని పెద్దనటుడైన ప్రభాస్ పొగడటం ఆనందంగా ఉందని శర్వానంద్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.