డబ్బుల కోసం నటించ లేదు

డబ్బుల కోసం నటించ లేదు

పోలీస్ క్యారక్టర్ లకు పెట్టింది పేరైన హీరో రాజశేఖర్ తాజా చిత్రం గడ్డం గ్యాంగ్. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ తాను ఎలాంటి క్యారక్టర్ కైనా సిద్ధమే అని అన్నారు. గడ్డం గ్యాంగ్ తర్వాత మరో మూడు చిత్రాలు రాబోతున్నాయి.  తానిప్పుడు క్యారక్టర్ పాత్రల్లో నటించడానికి కూడా ఓకే అని రాజశేఖర్ చెప్పారు.

గడ్డం గ్యాంగ్ చిత్రం తనకు మంచి విజయాన్ని అందిస్తుందనే నమ్మక ఉందని చెప్తూ తాను విజయాన్ని చవిచూసి అయిదేళ్ళు పైనే అవుతోంది అన్నారు.

ఆ మధ్య కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవన్నీ రొటీన్ పాత్రలేనని, వెరైటీ లేదని, అంతేకాదు వాటిలో వినోదంపాలుకూడా తక్కువేనని ఆయన అన్నారు.

అప్పట్లో తాను దాదాపుగా చాలా సింపుల్, ఒకేలాంటి సీరియస్ ఫిల్మ్స్ ఒప్పుకుని చేయడం వల్ల పెద్దగా ప్రభావం కనిపించలేదని చెప్పారు. ఆ క్రమంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకున్నానని, అందుకే భిన్నమైన కథాపాత్రలకోసం నిరీక్షించాను అని అన్నారు.

క్యారక్టర్ పాత్రల్లో నటించే అవకాశం చాలానే వచ్చాయని, కానీ తనకు ముందుగా ఒక విజయవంతమైన చిత్రం అవసరమని అనుకున్నానని రాజశేఖర్ చెప్పారు. ఆ తర్వాతే క్యారక్టర్ పాత్రలకు ఓకే చెప్పాలనుకున్నానని ఆయన అన్నారు.

తాను ఎప్పుడు డబ్బుల కోసం సినిమాలు చెయ్యలేదని, వెండితెర మీద ప్రేమతో చేసానని అంటూ తనకు అన్ని పాత్రలో ఇష్టమేనని చెప్పారు. తనకు పాత్రలు ఎప్పుడూ చెయ్యలేదని ఆయన చెప్పారు.

Send a Comment

Your email address will not be published.