తెలుగులో ఆశిక్ - 2

తెలుగులో ఆశిక్ - 2
బాలీవుడ్ లో విజయం సాధించిన ఆశిక్ – 2 చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
పరమేశ్వర ఆర్ట్ పతాకంపై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని తీస్తున్నారు.
మౌనమేలనోయి ఫేం సచిన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. నాయికగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మేనకోడలు నజియాను ఎంపిక చేసారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ ఫిలిం నగర్లో జరిగింది.
వ్యాపారవేత్త డీ. జయంత్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా జెమిని కిరణ్ స్విచ్ ఆన్ చేసారు.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ తమ సంస్థ తొలిసారిగా దబాంగ్ రీమేక్ గా గబ్బర్ సింగ్ నిర్మించిందని, ఇప్పుడు తాము ఆశిక్ – 2ను రీమేక్ చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రేమకథ తప్పకుండా ప్రేమహృదయాలను హత్తుకునేలా ఉంటుందని అన్నారు. ఇదొక గొప్ప ప్రేమ కథ అని చెప్తూ హైదరాబాద్, గోవా, ప్యారిస్ లలో చిత్రీకరణ ఉంటుందని అన్నారు.
సచిన్ తెలుగులో స్టార్ హీరో అవుతాడని ఆయన చెప్పారు.
తెలుగులో ఒరేయి పండు తర్వాత తాను నటిస్తున్న  చిత్రం ఈ ఆశిక్ – 2 రీమేక్ అని చెప్పారు.
ఈ చిత్రంలో రావు రమేష్, కాశీ విశ్వనాధ్, శశాంక్, పోసాని, రవివర్మ, అనిల్ చౌదరి, ప్రియా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు : మధుసూదన్, పాటలు : చంద్రబోస్, సంగీతం : అంకిత్ తివారి.

Send a Comment

Your email address will not be published.