తెలుగు చిత్రసీమలో ఆల్‌ రౌండర్‌

తెలుగు చిత్రసీమలో ఆల్‌ రౌండర్‌ బాలయ్య
ఏప్రిల్ 9 బాలయ్య 90వ పుట్టినరోజు
———

mannava-balayyaతెలుగు చలనచిత్రసీమలో ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన బాలయ్య పూర్తిపేరు మన్నవ బాలయ్య. ఈయన గుంటూరు జిల్లా వైకుంఠపురం శివారు గ్రామం చావపాడు లో గురవయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు ఏప్రిల్ 9, 1930న జన్మించారు. బాలయ్య మెకానికల్ ఇంజినీరింగులో బి.ఇ 1952లో పూర్తి చేశారు. 1957 వరకు మద్రాసు, కాకినాడ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేశారు.

మద్రాసు గిండీ కళాశాలలో చదువుకునే రోజుల్లో బాలయ్య నాటకాల్లో నటించారు. మిత్రుల ప్రోద్బలముతో చిత్రాల్లో నటించాలనే కోరిక గలిగి తాపీ చాణక్య సహకారముతో చిత్రసీమలో అడుగు పెట్టారు. 1958లో ఎత్తుకు పై ఎత్తు సినిమాలో నాయక పాత్ర వేశారు. తరువాత భాగ్యదేవత, కుంకుమరేఖ చిత్రాల్లో నటించారు. భూకైలాస్ చిత్రంలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులతో శివునిగా నటించే అవకాశం వచ్చింది. అటు తరువాత చెంచులక్ష్మి, పార్వతీకల్యాణం నుండి 350 పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించారు. 1970లో అమృతా ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి నేరము-శిక్ష, అన్నదమ్ముల కథ లాంటి మంచి చిత్రాలు నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము చెల్లెలి కాపురం చిత్రాన్ని ఉత్తమ చిత్రముగా ఎంపిక చేసి బంగారు నంది పురస్కారము బహూకరించింది. స్వీయ దర్శకత్వంలో పోలీస్ అల్లుడు (1994), ఊరికిచ్చిన మాట (1981) నిర్మించారు. 1991లో మద్రాసు నుండి హైదరాబాదు వచ్చారు. చిత్రాల్లో, టి.వి. సీరియల్స్ లోనూ నటిస్తున్నారు. 2000 సంవత్సరములో తీసిన “పల్లెవాసం-పట్నవాసం”కు ప్రభుత్వ ఉత్తమ సీరియల్ అవార్డ్ లభించింది. అంకురం చిత్రంలో నటనకు వంశీ-బర్కిలీ వారి ఉత్తమ క్యారెక్టర్ అవార్డ్ లభించింది.

‘ఎత్తుకు పై ఎత్తు’ చిత్రంతో బాలయ్య హీరోగా పరిచయమయి విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. Balayyaఅమృతా ఫిలింస్‌ సంస్థని నెలకొల్పి అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట్రావులను నిర్మాతలుగా చేసి చక్కని చిత్రాలు అందించారు. మంచి పర్సనాలిటీ, నటనా ప్రతిభ కలిగి ఉండటం వలన సాంఘిక చిత్రాల్లోనే కాక పౌరాణిక చిత్రాల్లో కూడా రాణించారు. సినిమాలలోకి రాకముందు రంగస్థల నటుడుగా వ్యవహరించారు. తను నిర్మించే చిత్రాలకు కథను కూడా తనే సమకూర్చేవారు ఇంజనీరింగ్‌ కోర్సు చేసిన బాలయ్య. నిర్మాతగా 1981లో విశ్వనాథ్‌ దర్శకత్వంలో ‘చెల్లెలి కాపురం’ చిత్రాన్ని, కృష్ణ హీరోగా ‘నేరము శిక్ష’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని తమిళ హిందీ భాషల్లోనూ నిర్మించారు.

చుట్టాలున్నారు జాగ్రత్త, కిరాయి అల్లుడు, అన్నదమ్ముల కథ, ప్రేమ-పగ, పసుపుతాడు, ఈనాటి బంధం ఏనాటిదో చిత్రాలకు నిర్మాతగా, ఊరికిచ్చిన మాటతో దర్శకుడుగా మారి కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. కుంకుమరేఖ, చివరకు మిగిలేది, మోహినీ రుక్మాంగద, మొనగాళ్ళకు మొనగాడు, పార్వతీ కళ్యాణం తదితర చిత్రాలు మంచి పేరు తెచ్చాయి. జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాలకు కూడా సరిపోయే పెర్సనాల్టిద్ బాలయ్యకు అదనపు అర్హత అయింది. సిగరెట్‌ పొగతో ముందు రాగా తర్వాత బాలయ్య ఎంట్రన్స్‌తో అతడే సి.ఐ.డి. ఆఫీసర్‌ అనే భ్రమ కల్పించిన సిసలైన విలన్‌గా పేరు తెచ్చుకున్నారు ‘మొనగాళ్ళకు మొనగాడు’ చిత్రంలో. పాండురంగడు, తప్పుచేసి పప్పుకూడు, పెళ్లిసందడి, అన్నమయ్య తదితర చిత్రాల్లో నటించిన బాలయ్య విలక్షణ నటునిగా ప్రశంసలందుకున్నారు.

Send a Comment

Your email address will not be published.