త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌‘ఎన్టీఆర్‌ 30’

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌‘ఎన్టీఆర్‌ 30’

‘ఎన్టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌తో ఎన్టీఆర్‌ కథానాయకుడుగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. దీనిని హారిక అండ్‌ హాసిని, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. అదేంటంటే? ఈ సినిమాలో మరో యువ కథానాయకుడికి అవకాశం ఉందట. త్రివిక్రమ్‌ గతంలో తెరకెక్కించిన ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’ సినిమాల్లో ఆది పినిశెట్టి, నవీన్‌ చంద్ర, సుశాంత్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ పాత్రల్లో కనిపించిన యువ కథానాయకులకి మంచి గుర్తింపు వచ్చింది. మరి ఎన్టీఆర్‌తో కలిసి నటించే ఆ కథానాయకుడు ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో బిజీగా ఉన్నారు తారక్‌. ఈ చిత్రం పూర్తయ్యాక ‘ఎన్టీఆర్‌ 30’ మొదలవుతుంది. నాయికగా సమంత, శ్రుతి హాసన్‌ పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

Send a Comment

Your email address will not be published.