గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘చాణక్య’. తిరు దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఇటలీ, మిలాన్‌లో పాటల చిత్రీకరణను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి కెమెరామెన్. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి, రైటర్: అబ్బూరి రవి.