దిల్ రాజ్ నంబర్ లేదు

దిల్ రాజ్ నంబర్ లేదు

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజ్ తో తనకు సంబంధం ఉందని వచ్చిన వదంతులపై నటి షీలా విస్మయం వ్యక్తం చేసారు.

జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మంచు మనోజ్ తదితరులతో కలిసి నటించిన షీలా మాట్లాడుతూ తన గురించి వచ్చిన వదంతులు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయని చెప్పారు. అసలా మాటలు ఎలా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో తెలియడం లేదని ఆమె అన్నారు.

సినీ పరిశ్రమతో ఇప్పుడు సంబంధాలే లేకుండా ఉన్నానని, తెలుగులో తాను చేసిన సినిమా వచ్చి మూడు సంవత్సరాలు అయినట్టు చెప్పారు. ఈ మూడు సంవత్సారాలలో తన వద్దకు మంచి స్క్రిప్ట్లు రాలేదని అంటూ తాను తెగ ప్రయాణాలు చేస్తున్నానని చెప్పారు. ఆ మధ్య ఎప్పుడో చాలా కాలం క్రితం హైదరాబాద్ వచ్చి వెళ్ళిన తర్వాత తన గురించి ఎందుకు అలా రాయవలసి వచ్చిందో బోధ పడటం లేదన్నారు.

దాదాపు ఏడాది పాటు ఆమె ఇంగ్లాండులో ఉన్నారు. అసలు హైదరాబాదుకి రానే లేదు. తాను హైదరాబాదు వచ్చి మూడు సంవత్సరాలు అయినట్టు షీలా చెప్పారు. అంతేకాదు తనకు హైదరాబాదులో సన్నిహిత మిత్రులు కూడా లేరని తెలిపారు. ఒకవేళ హైదరాబాదులో షూటింగ్ ఉన్న సమయాల్లోనూ షూటింగ్ ముగియడంతోనే చెన్నై వెళ్లి పోయే దానినని, ఒకవేళ ఉండవలసి వచ్చినా బస చేసే చోటే ఉండే దానినని అన్నారు. బయటకు వచ్చేదానిని కాను అని, తానూ అంతగా చనువు తీసుకుని నలుగురిలో కలిసిపోయే దానిని కానని చెప్పారు.

అంతేకాదు సినీ పరిశ్రమ వ్యక్తులతో ఎప్పుడూ మాట్లాడే దానిని కానని, దిల్ రాజ్ తో ఏ విధంగానూ టచ్ లో లేనని, అదుర్స్ సినిమా అప్పుడు ఒక్కసారి దిల్ రాజ్ తో మాట్లాడానని అన్నారు. అది కూడా ఆడియో వేడుకల కోసం ఆయన వచ్చినప్పుడే అని గుర్తు చేసారు. అంతవరకు ఎందుకండీ, నా వద్ద దిల్ రాజ్ నంబర్ లేదని షీలా చెప్పారు. ఆయనను చూసి చాలా కాలమైనట్టు ఆనే తెలిపారు. అయినా మా ఇద్దరి సంబంధాలు ఉన్నట్టు ఎందుకు వార్తలు వచ్చాయో తెలియడం లేదని చెప్పారు.

దిల్ రాజ్ నిర్మించిన పరుగు సినిమాలో షీలా నటించారు. ఈ సినిమాకు మొదట్లో తనని దిల్ రాజ్ ఎంపిక చేయలేదని, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తనను చూసి ఫోటో షూట్ పంపమని సూచించగా తానూ ఫోటోలు పంపానని, ఆ తర్వాతే తాను ఎంపిక అయినట్టు షీలా చెప్పారు. సినీ పరిశ్రమకు దీర్ఘకాలంగా దూరంగా ఉండటానికి కారణం మంచి కథలు తన వద్దకు రాకపోవడమే అని చెప్పారు. మంచి కథ వస్తే నటించే విషయాన్ని ఆలోచిస్తానని అన్నారు. అంతేకాదు ఆ సినిమా తీయడానికి ఎంత సమయం పడుతుంది అనేది కూడా లెక్క వేసుకుంటానని చెప్పారు. తాను అనుకున్న టైము సరిపోతుంది అనుకుంటేనే ఆ సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటాను అని షీలా చెప్పారు.

ఇలా ఉండగా, షీలా తో తన పేరు కలిపి వచ్చిన వదంతులకు దిల్ రాజ్ స్పందిస్తూ తాను షీలాను కలిసి చాలా కాలమైనట్టు చెప్పారు. కనుక ఎలాంటి ఆధారాలు లేని రూమర్లపై ఏం చెప్పగలనని ఆయన ఎదురు ప్రశ్నించారు.

Send a Comment

Your email address will not be published.