నందవనంలో రాజకుమారుడు

నందవనంలో రాజకుమారుడు

ఆ రాణి నిండు గర్భిణిగా ఉన్న సమయం. నందనవనానికి వెళ్ళారు. ఆరోజు పౌర్ణమి. పువ్వుల పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ నడచినప్పుడు ఆమెకు ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. అక్కడే ఆ వనంలోనే ఆమెకు మగ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పేరే సిద్ధార్థ అనే గౌతమ బుద్ధుడు. తల్లి పేరు మాయా. బుద్ధుడు పుట్టిన ఆ నగరం పేరు లుంబిని. అది అప్పట్లో కాలగర్భంలో కలిసిపోయింది. రెండు వేల అయిదు వందల సంవత్సరాలు దాటింది. గత శతాబ్దంలో శాస్త్రవేత్తలు ఓ చోట తవ్వినప్పుడు అశోకుడి శిలాఫలకం బయటపడింది.

దానికి దగ్గరలో ఉన్న ఒక శిల్పంలో సిద్దార్దుడిని తల్లి మాయా పొందిన సన్నివేశం చెక్కి ఉంది. ఈ విషయం తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్దమతస్తులు అక్కడి భారీ సంఖ్యలో తరలి వస్తారని అనుకున్నారు. కానీ కరెంటో, టెలిఫోన్, కాలువలు, తాగు నీరో లేని ఆ ప్రాంతానికి పట్టుమని పది మంది కూడా రాలేదు. దానితో ఇక్కడ సకల సౌకర్యాలూ కల్పించడం కోసం నేపాల్ ప్రభుత్వం రంగంలో దిగింది. పందొమ్మిది దేశాల బౌద్ధ మత పెద్దలను, ప్రభుత్వ అధికారులను ఆహ్వానించి చర్చలు జరిపి లుంబిని ప్రాంతాన్ని ఓ నవీన నగరంగా తీర్చిదిద్దింది.

Send a Comment

Your email address will not be published.