నంది అవార్డులు

తెలుగు సినీ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన నటీనటులకు ఏటా ఇచ్చే నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నవంబర్ 14వ తేదీన ప్రకటించింది.

Nandi Award2014, 15, 16 సంవత్సరాలకు నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్‌రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రకటనలో నంది అవార్డులను గెలుచుకున్న ఉత్తమ సినిమాల జాభితాను మొదటగా పేర్కొన్నారు. 2014వ సంవత్సరానికి గాను బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన భారీ బ్లాక్ బస్టర్ సినిమా లెజెండ్ అవార్డుని సొంతం చేసుకోగా….2015వ సంవత్సరానికిగాను రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ది బిగినింగ్ నందిని కైవసం చేసుకుంది. అలాగే 2016కు గాను ఘన విజయం సాధించిన తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండల పెళ్లి చూపులు చిత్రం నంది అవార్డుకి ఎంపికైంది.

ఈ అవార్డులకు ఎంపిక చేయడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం తొలుత వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. నటుడు గిరిబాబు, నిర్మాత పోకూరి బాబురావు, జీవిత రాజశేఖర్ అధ్యక్షతన మూడు కమిటీల సభ్యులు వివిధ సినిమాలను హైదరాబాద్‌లో తిలకించారు. ఆ తర్వాత వారు ఓ నిర్ణయానికి వచ్చారు. అనంతరం ఆ వివరాలను కమిటీ అమరావతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

ఉత్తమ చిత్రాలు…..(నంది బహుమతికి ఎంపికైన చిత్రాలు)
2014 ఉత్తమ చిత్రం: లెజెండ్, 2015 ఉత్తమ చిత్రం: బాహుబలి ది బిగినింగ్,
2016: ఉత్తమ చిత్రం: పెళ్లి చూపులు.

ఉత్తమ నటులు……2014 ఉత్తమ నటుడు: బాలయ్య, 2015 ఉత్తమ నటుడు: మహేష్ బాబు (శ్రీమంతుడు), 2016: ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్
ఉత్తమ నటి…..2014 ఉత్తమ నటి: అంజలి (గీతాంజలి), 2015 ఉత్తమ నటి: అసుష్క(సైజ్ జీరో), 2016 ఉత్తమ నటి: రీతూ వర్మ (పెళ్లిచూపులు)

ఉత్తమ దర్శకుడు..
2015 ఉత్తమ దర్శకుడు: రాజమౌళి(బాహుబలి ది బిగినింగ్)

ఎన్టీఆర్ జాతీయ అవార్డులు..
2014 ఎన్టీఆర్ జాతీయ అవార్డ్: కె.రాఘవేంద్రరావు, 2015 ఎన్టీఆర్ జాతీయ అవార్డ్: రజనీకాంత్, 2016 ఎన్టీఆర్ జాతీయ అవార్డ్: కమల్ హాసన్‌

2014 ఇతర అవార్డులు:
ఉత్తమ సహాయనటుడుగా నాగచైతన్య (మనం) ఎంపికయ్యారు.
ఉత్తమ సహాయనటిగా మంచు లక్ష్మీ (చందమామ కథలు) ఎంపికయ్యారు.
ఉత్తమ హాస్యనటుడుగా బ్రహ్మానందం (రేసు గుర్రం), ఉత్తమ హాస్యనటిగా విద్యుల్లేఖ (రన్ రాజా రన్), ఉత్తమ కెమెరామెన్ గా సాయిశ్రీ రామ్ (అలా ఎలా),
ఉత్తమ పాటల రచయితగా చైతన్య ప్రసాద్ (బ్రోకర్ 2), ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా కృష్ణవంశీ (గోవిందుడు అందరివాడేలే) ఎంపికయ్యారు.

2015 ఇతర అవార్డులు:
ఉత్తమ విలన్ గా రానా (బాహుబలి), ఉత్తమ సంగీత దర్శకుడుగా కీరవాణి,
ఉత్తమ మాటల రచయితగా సాయిమాధవ్ బుర్రా, ఉత్తమ పాటల రచయితగా రామజోగయ్య శాస్త్రి, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా కిషోర్ తిరుమల, ఉత్తమ సహాయ నటుడుగా పోసాని కృష్ణమురళి, ఉత్తమ సహాయనటిగా రమ్యకృష్ణ,
ఉత్తమ బాలనటుడుగా మాస్టర్ ఎన్టీఆర్ (దానవీరశూర కర్ణ) ఎంపికయ్యారు.
ఉత్తమ బాలనటి (దానవీరశూర కర్ణ)
ఉత్తమ హాస్యనటుడు వెన్నెల కిశోర్(భలే భలే మగాడివోయ్)
ఉత్తమ హాస్యనటి స్నిగ్ధ

2016 ఇతర నేష‌న‌ల్ అవార్డులు:
ర‌ఘుప‌తి వెంక‌య్య పుర‌స్కారానికి చిరంజీవి, బీఎన్ రెడ్డి జాతీయ పుర‌స్కారానికి బోయ‌పాటి శ్రీను, స్పెషల్ జ్యూరీ అవార్డుకు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి జాతీయ సినిమా అవార్డుకు కేఎస్ రామారావు ఎంపికయ్యారు.

Send a Comment

Your email address will not be published.