నవంబర్ 29న రోబో 2.0

నవంబర్ 29న రోబో 2.0

నవంబర్ 29న ప్రపంచ ప్రేక్షకుల ముందుకు వస్తున్న రోబో 2.0
—————————————

రజినీకాంత్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. హిట్ ప్లాప్ తో సంబంధం ఉండదు. రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే అభిమానులకు పెద్ద పండుగే. భారీ అంచనాలతో వచ్చిన కాలా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత రజినీకాంత్ పిజ్జా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్ లో జరుగుతోంది.
కాగా, రజినీకాంత్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న రోబో 2.0 సినిమా షూటింగ్ పూర్తయ్యి చాలా కాలం అయింది. గ్రాఫిక్స్ పనులు ఆలస్యం కావడంతో.. సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానిపై ఒక క్లారిటీ రాలేదు. మరోవైపు నిర్మాతపై బయ్యర్లు ఒత్తిడి తీసుకొస్తుండటంతో.. ఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్ ను యూనిట్ ప్రకటించింది. ఇండియాతో పాటు వాల్డ్ వైడ్ గా ఎంతో మంది ఆడియాన్స్ రెండేళ్లుగా అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా రోబో2.0. కానీ ఆ ఆసక్తిని అంతకంతకూ చంపేస్తూ.. సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్లింది ఈ సినిమా యూనిట్. గత ఏడాది దీపావళికే రావాల్సిన ఈ సినిమా.. తర్వాత జనవరి 25కి.. ఆపై ఏప్రిల్ కు వాయిదా పడి.. చివరికి .. అసలు వార్తల్లోనే లేకుండాపోయింది. దింతో కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి ఊసేలేదు.అసాలు రిలీజ్ అవుతుందనే నమ్మకము లేదు.అయితే సడన్ గా అందరికి షాక్ ఇస్తూ ఈ ఏడాది నవంబర్ 29 న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు శంకర్ అధికారికంగా ప్రకటించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాకోసం దాదాపుగా రూ.500 కోట్లు ఖర్చు చేసింది. రోబో హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ ఐ సినిమా పరాజయం తరువాత ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ నటించాడు.

రోబో2.0 రిలీజ్ డేట్ పై శంకర్ తో పాటు నిర్మాణ సంస్థ కూడా క్లారిటి ఇవ్వడంతో ఆడియాన్స్ లో అటేక్షన్ పెరిగింది.అందరూ అనుకుంటున్నట్లే విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జాప్యమే ‘2.0’ విడుదల ఆలస్యం కావడానికి కారణమని శంకర్ చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్న స్టూడియో.. ఔట్ పుట్ ఇవ్వడానికి డేట్ ఖరారు చేసిందని.. వీఎఫెక్స్ పనుల ప్రోగ్రెస్ చూసి.. క్వాలిటీ విషయంలో సంతృప్తి చెందాక.. మిగతా పనుల విషయంలోనూ ఒక అంచనాకు వచ్చాకే శంకర్ రిలీజ్ డేట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

మొత్తనికి బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ తో ఇండియాలో రిలీజ్ అవుతున్న రెండో సినిమా కావడంతో రోబో2.o పై అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయ్.ఈ సినిమా కూడా బహుబలిలా కాసుల వర్సం కురిపించడం ఖాయం అనే కామెంట్స్ ఊపందుకున్నాయ్. అయితే ఈ సినిమాకి టాలీవుడ్ ,బాలీవుడ్ సినిమాల నుండి పోటి ఉంటుందా అంటే…ఆ విషయంలో కుడా జాగ్రత్తలు తీసుకున్నాడు శంకర్.నవంబర్ 29కు సంబంధించి బాలీవుడ్ లో పెద్ద సినిమాలతో ఎలాంటి పోటీలేదు. అమీర్ కు చెందిన ఓ సినిమా అప్పటికే విడుదలైపోతుంది. ఇటు టాలీవుడ్ లో కూడా 2.0తో ఎలాంటి క్లాష్ లేదు. ఎన్టీఆర్ సినిమా కూడా అప్పటికి థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఎటొచ్చి కోలీవుడ్ లోనే పరిస్థితి కాస్త పోటీ కనిపిస్తోంది. ప్రజంట్ అజిత్, సూర్య నటిస్తున్న సినిమాల్ని నవంబర్ లోనే విడుదలకు ప్లాన్ చేశారు. ఈ రెండూ కాకపోయినా వీటిలో కనీసం ఒకటి 2.0కు పోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు.మొత్తనికి నిన్నటి వరకు డౌట్ లో ఉన్న రోబో2.0 రిలీజ్ పై క్లారిటి రావడంతో సిని లవర్స్ లో ఊత్సహం ఉరకలేస్తోంది.మరి టీజర్ ,ట్రైలర్స్ తో ఈ హైప్ ఎ రేంజ్ కి చేరుతుందో వెచి చూడాలి.

Send a Comment

Your email address will not be published.