నోబెల్ వేదికపై భారత్ కీర్తికిరీటం

అభిజిత్ వినాయక్ బెనర్జీ

Abhijit Banerjeeపేదరిక నిర్మూలనకు చేసిన కృషి, అవలంభించాల్సిన ఆర్థిక విధానాలపై అధ్యయనానికి అర్థ శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు ముగ్గురు ఆర్థికవేత్తలు. ప్రవాస భారత ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో (ఫ్రెంచ్ అమెరికన్), అమెరికన్ ఆర్థికవేత్త మైకెల్ క్రెమెర్ కలిసి ఉమ్మడిగా చేసిన పరిశోధనలకు నోబెల్ దక్కింది. అభిజిత్ బెనర్జీ.. పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు.
ఆర్థిక‌శాస్త్రంలో నోబెల్ గెలిచిన రెండ‌వ భార‌తీయ సంత‌తి వ్య‌క్తిగా అభిజిత్ బెన‌ర్జీ నిలిచారు. గ‌తంలో అమ‌ర్త్యాసేన్ ఎక‌నామిక్స్‌లో నోబెల్ గెలిచారు. ఈ ఏడాది ప్ర‌క‌టించిన నోబెల్ అవార్డుల్లో అభిజిత్‌కు ఆర్థిక‌శాస్త్రంలో అవార్డు ద‌క్కింది. పేదరిక నిర్మూల‌న కోసం అభిజిత్ ప్ర‌తిపాదించిన ప‌రిశోధ‌నా న‌మూనాలు ఎంతో ఉప‌యుక్తంగా ఉన్నాయ‌ని నోబెల్ క‌మిటీ చెప్పింది.

అభిజిత్ బెనర్జీ
—————
ఫిబ్ర‌వ‌రి 21, 1961లో అభిజిత్ వినాయక్ బెనర్జీ ముంబైలో జ‌న్మించారు. కోల్‌క‌త్తా వ‌ర్సిటీలో గ్రాడ్యుయేష‌న్ చేశారు. జ‌వ‌హ‌ర్‌లాస్ వ‌ర్సిటీ నుంచి పీజీ చేశారు. 1988లో అమెరికాలోని హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. క్యాంబ్రిడ్జ్ లోని మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ఫోర్డ్ ఫౌండేష‌న్‌లో ఆర్థిక‌శాస్త్ర ప్రొఫెస‌ర్‌గా చేస్తున్నారు. 2003లో అబ్దుల్ ల‌తీఫ్ జ‌మీల్ పావ‌ర్టీ యాక్ష‌న్ ల్యాబ్‌ను అభిజిత్ ప్రారంభించారు. దాంట్లో డుఫ్లో, సెంథిల్ ములైనాథ‌న్‌లు కూడా ఉన్నారు. ఆ ప‌రిశోధ‌న‌శాల‌కు అభిజిత్ డైర‌క్ట‌ర్‌గా ఉన్నారు. ఆర్థికవేత్తలయిన ఎస్తేర్ డఫ్లో, సెంథిల్ మురళీధరన్‌లతో కలిసి ఆయన దీన్ని ఏర్పాటు చేశారు. ఆర్థిక అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అనేక మ్యాగజీన్స్, జర్నల్స్‌లో వ్యాసాలు రాసిన ఆయన పలు పుస్తకాలు కూడా రాశారు. అభిజిత్ బెనర్జీ 2011లో రాసిన ‘పూర్ ఎకనమిక్స్’ పుస్తకం గోల్డ్‌మన్ శాక్స్ బిజినెస్ బుక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా అందుకుంది. ఇది కాకుండా ‘వొలాటిలిటీ అండ్ గ్రోత్’, ‘అండర్ స్టాండింగ్ పావర్టీ’ వంటి పుస్తకాలు రాశారు. ‘2015 తరువాత అభివృద్ధి అజెండా’కు సంబంధించి ఐరాస సెక్రటరీ జనరల్ హైలెవల్ ప్యానల్‌లోనూ సేవలందించారు.

అభిజిత్ బెనర్జీ చేసిన ఓ అధ్యయనం భారత్‌లోని దివ్యాంగ చిన్నారుల స్కూల్ విద్య వ్యవస్థ మెరుగైందని తేల్చింది. సుమారు 50 లక్షల మంది దివ్యాంగ విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని ఆ అధ్యయనం చెప్పింది. యూఎన్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌లోని డెవ‌ల‌ప్‌మెంట్ ఎజెండాలోనూ అభిజిత్ స‌భ్యుడిగా ఉన్నారు. అభిజిత్ భార్యే ఈస్త‌ర్ డుఫ్లో. ఈమెకు కూడా నోబెల్ క‌మిటీ అవార్డు ఇచ్చింది. అభిజిత్ వ‌ద్దే డుఫ్లో పీహెచ్‌డీ చేసింది. ఆర్థిక‌శాస్త్రం కేట‌గిరీలో నోబెల్ అందుకున్న రెండ‌వ మ‌హిళ‌గా డుఫ్లో రికార్డు క్రియేట్ చేసింది. నోబెల్ అందుకున్న అతిపిన్న వ‌య‌సున్న మ‌హిళ‌గా కూడా ఆమె ఘ‌న‌త సాధించింది. అభిజిత్‌ కలిసి ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతి పంచుకుంటున్న ఎస్తేర్ డఫ్తో ఈ పురస్కారం గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. ఫ్రాన్స్‌కు చెందిన ఆమె ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న రెండో మహిళగానూ ఘనత సాధించారు. ఆమె ప్రస్తుతం మసాచూషెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎకనమిక్స్‌లో ‘ఫోర్డ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్’గా పనిచేస్తున్నారు. మరో విజేత క్రెమెర్ 1964లో జన్మించారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

న్యాయ్ పథకం రూపకల్పనలో అభిజిత్ పాత్ర:
ఆర్థిక శాస్త్రంలో నోబెల్ సాధించిన అభిజిత్ బెనర్జీని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందించారు. పేదరిక నిర్మూలనకు ఆయన చేసిన కృషిని మెచ్చుకున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన హామీ అయిన ‘న్యాయ్’ పథకం రూపకల్పనలో అభిజిత్ కీలక పాత్ర పోషించారని రాహుల్ చెప్పారు. ఈ స్కీమ్ ద్వారా పేదరికాన్ని నిర్మూలించి.. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని భావించామన్నారు. కానీ దీనికి విరుద్ధంగా ప్రస్తుత మోడీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తూ.. పేదరికాన్ని పెంచుతున్నారని అన్నారు రాహుల్. న్యాయ్ పథకం కింద దేశంలోని పేదలందరికీ నెలకు రూ.6 వేల చొప్పున ఇస్తామని 2019 ఎన్నికల్లో రాహుల్ ప్రకటించారు.

ఠాగూర్ నుండి బెనర్జీ వరకు (భారతీయ సంతతికి చెందిన నోబెల్ అవార్డు గ్రహీతలు)
రవీంద్రనాథ్ ఠాగూర్ (1913) – సాహిత్యం
సి.వి.రామన్ (1930) – భౌతిక శాస్త్రం
హరగోబింద్ ఖొరానా (1968) – వైద్యం
మదర్ థెరీసా (1979) – శాంతి
సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ (1983) – భౌతిక శాస్త్రం
అమర్త్య సేన్ (1998) – ఆర్ధిక శాస్త్రం
వెంకటరామన్ రామకృష్ణన్ (2009) – రసాయన శాస్త్రం
కైలాస్ సత్యార్ది (2014) – శాంతి
అభిజిత్ బెనర్జీ (2019) – ఆర్ధిక శాస్త్రం

అభినందనలు:
పేదరిక నిర్మూలనకు అభిజిత్ బెనర్జీ ఎనలేని కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 2019కి గాను నోబెల్ ప్రైజ్ కు ఎంపికైనందుకు అభిజిత్ తోపాటు ఎస్తర్, మైకెల్ క్రెమర్ లను ఆయన అభినందించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. 2019 ఎన్నికలకు ముందు తాము ప్రతిపాదించిన కనీస ఆదాయ హామీ పథకం(న్యూతమ్ ఆయ్ యోజన-ఎన్‌వైఏవై) వెనుక అభిజిత్ బెనర్జీ ఆలోచనలు ఉన్నాయని.. ఈ పథకం విషయంలో ఆయన తమ ముఖ్య కన్సల్టెంట్ అని ఆ ట్వీట్‌లో తెలిపింది.

భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపికవడంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. కలకత్తాలోని సౌత్ పాయింట్ స్కూల్, ప్రెసిడెన్సీ కాలేజీల్లో ఆయన చదువుకున్నారని మమత గుర్తు చేశారు. దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు ఆయన అభివృద్ధి చేసిన నమూనాల ఫలితమేనని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ ట్వీట్‌కు స్పందించిన అభిజిత్ ‘జై హింద్’ అని ట్వీట్ చేశారు. మమత ట్వీట్‌కు ‘థాంక్యూ దీదీ’ అంటూ స్పందించారు. జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ డోభాల్ వంటివారు అభిజిత్‌ను అభినందిస్తూ ఆయన దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ పూర్వవిద్యార్థి అంటూ గుర్తు చేసుకున్నారు.

Send a Comment

Your email address will not be published.