న్యూజీలాండ్ లో ప్రపంచ తొలిబోనం

Photo1 Photo4
న్యూజిలాండ్లోని ఆక్లాండ్ పట్టణం లోని మౌంట్ ఈడెన్ వార్ మెమోరియల్ హాల్ లో ఆదివారం 15 జూలై 2018న అంగరంగ వైభవంగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో “తెలంగాణ బోనాలు “ నిర్వహించారు .

ఈ కార్యక్రమంలో ముందుగా మంత్రోచ్ఛరణతో అమ్మవారి పూజ నిర్వహించారు. తెలంగాణ ప్రముఖ దంపతులు పూజలో భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. అమ్మవారికి, శాఖ తో పాటు నైవేద్యం సమర్పించారు. రామ్మెహన్ దంతాల పూజ కార్యక్రమాలను పర్యవేక్షించారు. జగన్ మోహన్ రెడ్డి వాడ్నలా బోనం ఊరేగింపు ఏర్పాట్లు ,అతిధులను ఆహ్వానించడం పర్యవేక్షించారు.

ప్రపంచ కాలమానంలో న్యూజిలాండ్ దేశం దాదాపు 6 గంటలు ముందు ఉండడం వలన, అమ్మవారి ఆజ్ఞతో తొలిబోనం చేసుకునే అవకాశం ఈ సంవత్సరం తెలంగాణ అసోసియేషన్ కు లభించిందని అధ్యక్షుడు కళ్యాణ్ రావు కాసుగంటి సంతోషంగా తెలిపారు .

ఈ కార్యక్రమంలో ముందుగా, బోనాల ఊరేగింపు కన్నులపండువగా జరిగింది. బోనాల పాటలతో మౌంట్ ఈడెన్ హోరెత్తింది. తెలంగాణ వంటలతో దావత్ అందరికి నోరూరించింది .
Photo2
ఆక్లాండ్ మరియు ఇతర నగరాలలో తుపానుతో, కొన్ని ప్రాంతాల్లో వరద ప్రభావాన్ని లెక్క చెయ్యకుండా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారని అడ్వైసరీ బోర్డు మెంబెర్, ఈ అమ్మవారి బోనాలకు సమన్వయకర్త గా వ్యవహరించిన నరేందర్ రెడ్డి పట్లోళ్ల తెలిపారు.

ఈ సంవత్సరం న్యూ జీలాండ్ లోని చాల మంది ప్రముఖులు బోనాలు ఉత్సవంలో పాల్గొని, అందరికి శుభాకాంక్షలు తెలిపి అమ్మవారి ఆశీస్సులు పొందిన వారిలో నేషనల్ పార్టీ ఎంపీ కన్వల్జిత్ సింగ్ భక్షి, ప్రకాష్ బిరాడర్, హర్షద్ పటేల్ , విజయ్ భాస్కర్ రెడ్డి కొసన,వేణు బీరం, శ్రీనివాస్ పానుగంటి, అమర్ అల్లూరి, జగదీష్ రెడ్డి పట్లోళ్ల, జగదీష్ రెడ్డి మగతాల, కృష్ణ పూసర్ల, ధర్మేందర్ అల్లే, కిరణ్ పోకల, సునీల్ కుంచ, వెంకట్ రామ్ రెడ్డి దాయాది ,రాఘవేంద్ర కట్టెల, విశ్వేశ్వర్ రావు ,సునీతవిజయ్, వర్ష రెడ్డి పట్లోళ్ల, శ్రీదేవి పూసర్ల, శ్రీలత మగతాల, శీతల్ అలాం, ప్రతిభ తదితరులు వున్నారు .

కమిటీ మెంబెర్స్ సురేందర్ యడవల్లి జనరల్ సెక్రటరీ ,విజేత యాచమనేని ,వినోద్ కుమార్ ఎర్రబెల్లి ,రామ్ రెడ్డి తాటిపర్తి , ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.
Photo3
నర్సింగరావు పట్లొరి, మీడియా వ్యవహారాలను పర్యవేక్షించారు. గిరిధర్ మోర్ల ,వరుణ్ రావు మేచినేని , శ్రీహరి రావు బండ రుచికరమైన తెలంగాణ వంటలు అందించారు.

న్యూ జీలాండ్ఇండియన్ వీకెండేర్ పత్రిక నుండి సందీప్ మరియు రిజవాన్ లు పాల్గొని ప్రత్యేక కవర్జె అందించారు.

Send a Comment

Your email address will not be published.