పావు గంటలో ఓకే అయిన స్క్రిప్ట్

పావు గంటలో ఓకే అయిన స్క్రిప్ట్
అష్టా చమ్మ చిత్రంలో కమెడియన్ గా టాలీవుడ్ కు పరిచయమైనా శ్రీనివాస్ అవసరాల ఇప్పుడు దర్శకుడిగా అభిమానుల ముందుకు వస్తున్నారు.
ఊహలు గుస గుసలాడే చిత్రం తాలూకు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఈ చిత్రానికి శ్రీనివాస్ అవసరాల దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
ఈ చిత్రంలో శౌర్య, రాశి  ఖన్నా తదితరులు నటిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బోయపాటి శ్రీను మాట్లాడుతూ పెద్ద సినిమా చిన్న సినిమా అని ఉండవని , మంచి సినిమా అని మాత్రమే ఉంటుందని అన్నారు. ఈ చిత్రం కూడా మంచి చిత్రంగా ఉంటుందని తాను నమ్ముతున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ ప్రాజెక్ట్ శ్ర్రేనివాస్ అవసరాలకు మంచి పేరు తెచ్చిపెట్టాలని తాను  మనసారా కోరుకుంటున్నానని చెప్పారు.
ఈ సందర్భంగా అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ చిత్రం కథను తాను కేవలం పదిహేను నిమిషాల్లో నిర్మాత సాయి కొర్రపాటికి వివరించానని, వెంటనే కొర్రపాటి గారు సినిమా ప్రారంభించు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. ఈ చిత్రంలో ఒక క్యారక్టర్ ఉందని, ఆ పాత్రలో తాను నటించాలని అనుకుంటున్నానని  చెప్పారు. నిర్మాత కూడా అందుకు ఓకే చెప్పారని, కానీ తానే ఆలోచిస్తున్నానని  అవసరాల శ్రీనివాస్ తెలిపారు.
పాటలు : సిరివెన్నెల సీతారామ శాస్త్రి, అనంత్ శ్రీరాం.
హీరో శౌర్య ప్రతిభ కోసం ఇంటర్నెట్ లో వెతికి వెతికి పట్టుకుని ఎంపిక చేసినట్టు దర్శకుడు అవసరాల శ్రీనివాస్ చెప్పారు.
కల్యాణి కోడూరి స్వరాలూ సమకూర్చారు.

Send a Comment

Your email address will not be published.