పేరేంటబ్బా!

పేరేంటబ్బా!

హీరో మహేషం బాబు తదుపరి చిత్రం పేరు ఇంకా ఖరారు కాలేదు. బహుశా కృష్ణా ముకుందా మురారి లేదా హరే రామ హరే కృష్ణ అనే వాటిలో ఏదో ఒకటి ఖరారు కావచ్చని ఈ చిత్ర దర్శకుడు వంశి పైడిపల్లి చెప్పారు. మహేష్ బాబుకు ఇది ఇరవై అయిదో చిత్రం.

ప్రస్తుతం పైడిపల్లి వంశీ ఈ చిత్రం తాలూకు ప్రీ ప్రొడక్షన్ పనిలో నిమగ్నమయ్యారు. అది పూర్తవడంతోనే మహేష్ బాబు కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం కావచ్చు. వంశి ఇప్పుడు అమెరికాలో స్క్రిప్టు వర్కుతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకులు ఎవరనేది కూడా నిర్ణయమైంది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అంటూ వంశీతో కలిసిన ఫోటోలు వెలువడ్డాయి.

ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వనీదత్ కలిసి నిర్మిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ వినోదాత్మక చిత్రం. మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతోంది. 2018 ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఈ కొత్త చిత్రం మొదలవుతుందని అంచనా.

Send a Comment

Your email address will not be published.