ప్రపంచ సాహితీ సదస్సు

కళలకి పుట్టినిళ్ళు అయిన మెల్బోర్న్ మహా నగరం మరో మెట్టు ఎక్కి ఆస్ట్రేలియాలోని తెలుగువారి ప్రస్థానం ప్రపంచ స్థాయికి తీసుకెళ్తూ మరో మైలు రాయిని అధిగమించబోతోంది. వచ్చే నవంబరు 3, 4 తేదీలలో అమెరికాలోని వంగూరి ఫౌండేషన్, భారత దేశంలోని లోక్ నాయక్ ఫౌండేషన్ మరియు ఆస్ట్రేలియాలోని ఆస్ట్రేలియా తెలుగు సంఘం కలిసి 6వ ప్రపంచ సాహితీ సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి “తెలుగు మల్లి” ప్రధాన సమన్వయకర్తగా నిర్వహణ బాధ్యతలు చేపట్టింది.

నేపధ్యం
2007 లో మొదలయిన ఈ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుల ప్రస్థానం ఇప్పటివరకూ నాలుగు దేశాలలో (భారత దేశంలో హైదరాబాద్ , అమెరికాలో హ్యూస్టన్ మహా నగరం, యునైటెడ్ కింగ్డం లో లండన్ మహా నగరం, సింగపూర్) స్థానిక తెలుగు సంఘాల సహకారంతో దిగ్విజయంగా జరిగాయి. శ్రీయుతులు బాపు-రమణ, డా. సినారె, గొల్లపూడి, డా. యార్లగడ్డ , గౌ. మండలి బుద్ద ప్రసాద్, సిరివెన్నెల, జొన్నవిత్తుల, తనికెళ్ళ భరణి, అశోక్ తేజ, భువన చంద్ర, అవధాన సరస్వతి పాలపర్తి, డి. కామేశ్వరి, అక్కిరాజు రమాపతి రావు, ద్వానా శాస్రి , నటుడు బ్రహ్మానందం, ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, ఆచార్య ముత్యాల నాయుడు, చందు సుబ్బారావు, కె. మల్లీశ్వరి, ముక్తేవి భారతి, కె. శ్రీనివాస్, హాస్య బ్రహ్మ శంకర నారాయణ, మీగడ రామలింగ స్వామి మొదలైన సుప్రసిద్ధ సాహితీవేత్తలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సెప్టెంబర్, 2014 లో సింగపూర్ లో జరిగిన 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు 12 దేశాలనుండి సుమారు 500 మంది ప్రతినిధులు పాల్గొని సభను దిగ్విజయం చేశారు.

ఆస్ట్రేలియా ఖండంలో ప్రపంచ స్థాయిలో తెలుగు సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ సాహిత్య సదస్సు జరగడం చరిత్రలో ఇదే మొదటి సారి. ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలలో తెలుగు భాషాభివృద్ధి నేపధ్యంగా జరగనున్న ఈ సదస్సుకు భారతదేశం నుండి తెలుగు భాషలో నిష్ణాతులైన పలువురు వక్తలతోపాటు చాలా దేశాల నుండి అనేకమంది తెలుగు భాషాభిమానులు సాహితీ ప్రియులు పాలుపంచుకోనున్నారు.

సదస్సు ప్రధాన ఆశయాలు
1. ప్రపంచవ్యాప్తంగానూ, ముఖ్యంగా ఆస్ట్రేలియా మరియు దక్షిణ ఆసియా ఖండం లో ఉన్న దేశాలలో నివశిస్తున్న తెలుగు రచయితలూ, పండితులూ, సాహిత్యాభిమానులూ, కలుసుకుని తమ తెలుగు సాహిత్యాభిమానాన్నీ, తమ రచనలనీ సహ భాషాభిమానులతో, ఆత్మీయ వాతావరణంలో పంచుకునే వేదిక ని కల్పించడం.
2. తెలుగు సాహిత్యానికి ప్రపంచ వ్యాప్తంగానే కాక తెలుగు నాట కూడా తగిన గుర్తింపుకి ఆచరణ సాధ్యమైన ప్రణాళికల పై చర్చించడం.
3. తెలుగు భాషకీ, సంస్కృతికీ అనుసంధానమైన తెలుగు సృజనాత్మక సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ ఆంగ్ల భాషా ప్రభావంలో రెప రెపలాడుతున్న మన ప్రాచీన, ఆధునిక సాహిత్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం.
4. నిష్ణాతులైన సాహిత్య కారుల ఆహ్లాదకరమైన ప్రసంగాలు వినే అవకాశం కల్పించడం.

ప్రత్యేక ఆకర్షణలు
స్వీయ రచనా పఠనం, నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు, నూతన పుస్తకావిష్కరణలు, పుస్తక విక్రయ శాల, చర్చా వేదికలు, సరదా సాహిత్య పోటీలు, “సాహిత్య “ప్ర-జ” ప్రత్యేక వేదిక” (సాహిత్యపరమైన ప్రశ్నలూ-జవాబులు), అందరూ అప్పటికప్పుడు పాల్గొనే గొలుసు కథ, మరెన్నో….

For More Information, and expression of interest in participation, please contact
సదస్సు సంచాలకులు
Sreeni Katta (President, Telugu Association of Australia, Melbourne)
Phone 61 413 398 940, E-mail: sreenik2004@yahoo.com.au
Dr. Vanguri Chitten Raju (Vanguri Foundation of America)
Phone: (1) 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com

ప్రధాన సమన్వయ కర్త: Rao Konchada (తెలుగు మల్లి వ్యవస్థాపకులు)
Phone: 61 422 116 542, E-mail: rao.konchada@gmail.com

భారత దేశ సమన్వయ కర్త: Dr. Vamsee Ramaraju
Phone: (91) 98490 23852, E-mail: ramarajuvamsee@yahoo.co.in

గౌరవ సలహాదారులు: “పద్మభూషణ్” డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (భారత దేశం), సారధి మోటమర్రి (ఆస్ట్రేలియా తెలుగు సాహితీ సమాఖ్య, సిడ్నీ), శాయి రాచకొండ (హ్యూస్టన్),

Send a Comment

Your email address will not be published.