ప్రభాస్‌ కొత్త సినిమా 'రాధేశ్యామ్'

Radhe Shyamతెలుగు నటుడు ప్రభాస్‌ తన ఇరవై చిత్రాన్ని రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్‌ పేరుని రాధేశ్యామ్‌గా నిర్ణయించింది. చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్ని చిత్రం బృందం విడుదల చేసింది. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించి చిత్రీకరణ ఇప్పటికే 70 శాతంపైగా పూర్తి చేసుకొంది. గత కొన్నాళ్లుగా ఈ సినిమా టైటిల్‌ కోసం ఎదరుచూస్తున్న ప్రభాస్‌ అభిమానుల కల నేటితో నెరవేరింది. సినిమాని వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నట్లు కూడా చిత్రబృందం ప్రకటించింది. ఇందులో నటీనటులుగా జగపతిబాబు, సత్యరాజ్‌, భాగ్యశ్రీ, జయరాం, మురళీ శర్మ ప్రియదర్శి తదితరులు నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

‘రాధేశ్యామ్‌’ తొలి పోస్టర్‌తోనే సినిమా కథాంశానికి సంబంధించిన కొన్ని కీలక విషయాల్ని చిత్ర బృందం తెలియజేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రచార చిత్రంలో కుడివైపు కోటలా కనిపించిన కట్టడం రోమా క్యాజిల్‌. మరోవైపు చిన్న చిన్న కట్టడాలతో కనిపించింది వెనీజో టౌన్‌. ఇటలీ నేపథ్యంగా సాగే ఓ నిర్దేశిత కాలానికి సంబంధించిన ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆ ప్రేమ కథకు ఇటలీలోని ఈ వెనిజో, రోమాలే కీలకమని తెలుస్తోంది. పైగా పూజాహెగ్డే లాంగ్‌ఫ్రాక్‌ చుట్టూ నీటిని గ్రాఫిక్స్‌తో ముడిపెట్టారు. అంటే కథలో నీరు(వరదలు) ప్రధానమని చెప్పకనే చెప్పారని అభిమానులు భావిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రం కోసం త్వరలోనే హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వెనీజో టౌన్, రోమా ప్రాంతాలకు సంబంధించిన కొన్ని కీలక సెట్లను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రముఖ ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఆర్‌.రవీందర్‌ రెడ్డి ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన సారథ్యంలోనే హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో భారీ ఆస్పత్రి సెట్‌ను సిద్ధం చేస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.