ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ ఏమిటి?

ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ ఏమిటి?

రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రస్తుతం నిర్మిస్తున్న బాహుబలి సినిమా టాకీ పార్ట్ పనులు శరవేగంతో సాగాయని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయని ఆ చిత్ర యూనిట్ భోగట్టా.

ఈ చిత్రంలో వంద శాతం అంకితభావంతో పని చేసిన హీరో ప్రభాస్ దాదాపు ఈ సినిమా కోసం రెండేళ్ళ సమయం కేటాయించారు.

ఆయన నటించి రెండు సంవత్సరాల క్రితం విడుదల అయిన చివరి చిత్రం మిర్చి. ఇప్పుడు ప్రభాస్ చూపులన్నీ బాహుబలి పైనే ఉన్నాయి. ఈ చిత్రం విజయవంతమవడం ఆయన కెరీర్ కు పెట్టనికోట అవుతుంది.

అది అలా ఉండనిస్తే ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్ ఏమిటి అనే దానిపై ఇప్పుడే చర్చలు మొదలయ్యాయి.

కొన్ని రోజుల క్రితం ఆయన పెదనాన్న కృష్ణం రాజు ఒక ప్రకటన చేస్తూ తాను ఒక చిత్రం  చేయాలనుకుంటున్నానని, ఆ చిత్రం టైటిల్ ఒక్క అడుగు అని, అందులో ప్రభాస్ కథానాయకుడని వెల్లడించారు. అంతేకాదు ఆ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తానని కూడా కృష్ణం రాజు చెప్పారు. మరి ప్రభాస్ ఆ సినిమా చేస్తాడా లేక మరో చిత్రం చేస్తాడా అనేది ఇకా తెలియరాలేదు.

ఇలా ఉండగా బాహుబలి చిత్రంలోని మిగిలిన నటీనటులు అనుష్కా, తమన్నా, రానా, అడివి శేష్ తదితరులు ఇప్పటికే కొత్త చిత్రాలతో బిజీగా ఉన్నారు.

ఏదేమైనా ప్రభాస్ కొత్త ప్రాజెక్టు మీద త్వరలోనే ఒక ప్రకటన వెలువడే అవకాసం ఉందని టాలీవుడ్ వార్గాల మాట. లేదా ప్రభాస్ తాను ఏం చెయ్యాలి అనే దానిపై ఆయనే ఒక నిర్ణయం తీసుకుంటారా అని దానికోసం వేచిచూడాలి.

Send a Comment

Your email address will not be published.