గ్రీకువీరుడు, మహా వీరుడుగా సుప్రసిద్ధుడైన అలెగ్జాండర్ ప్రపంచంలో చాలా భాగం జయించిన గొప్ప వీరుడు. ఇందులో ఎలాంటి అసత్యం లేదు. గ్రీకు దేశంలోని మాసిడోనియా నుంచి బయలుదేరి భారతదేశపు పశ్చిమ భాగం వరకు వచ్చి తన మాతృదేశానికి తిరిగి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో బాబిలోనియా నగరంలో క్రీస్తు పూర్వం 323 లో చనిపోయాడు.
ఆయన మృతదేహాన్ని బంగారు రథంలో ఉంచి 64 గుర్రాలను ఆ రథానికి కట్టి ఊరేగింపుగా తీసుకువెళ్ళారు. ఆయన చనిపోయిన బాబిలోనియా నుంచి ఆయన పేరిట విలసిల్లిన ఈజిప్టులోని అలెగ్జాండ్రియా వరకు ఈ అంతిమ యాత్ర సాగింది. ఈ దూరం దాదాపు వెయ్యి మైళ్ళు. ఈ ఊరేగింపుకోసం అనేక కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు చరిత్రకారులు చెప్తుంటారు.
– నీరజ చౌటపల్లి