బాబాయి - అబ్బాయి

వచ్చే సంక్రాంతికి బాబాయి, అబ్బాయి సినిమాలు విడుదల కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా వచ్చే ఏడాది జనవరి ఎనిమిదో తేదీన విడుదల అవబోతోంది. సరిగ్గా ఆ సంక్రాంతి సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ బాబాయి బాలకృష్ణ చిత్రం కూడా విడుదల కాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. బాలకృష్ణ చిత్రం పేరు డిక్టేటర్ గా ఇప్పటికే ఖాయమైంది.

డిక్టేటర్ చిత్ర యూనిట్ సభ్యులు దీర్ఘ షెడ్యూల్ కోసం అమెరికా వెళ్తోంది. అక్కడ జరిగే చిత్రీకరణతో డిక్టేటర్ లో చాలా భాగం పూర్తి అవుతుంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్నారు.ఆయన నటిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంతో సాగుతోంది. అక్కడ షూటింగ్ ముగించుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బృందం స్పెయిన్ వెళ్ళనున్నది.

Send a Comment

Your email address will not be published.