బుల్లితెర ప్రదీప్ ఆత్మహత్య

బుల్లితెర ప్రదీప్ ఆత్మహత్య

ప్రముఖ బుల్లితెర నటుడు, సప్తమాత్రిక సీరియల్ లో కథానాయకుడు అయిన ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాల గూడ అక్కాపురి కాలనీలోని గ్రీన్ హోం అపార్ట్ మెంట్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం బుల్లితెర రంగంలో అందరినీ ఆందోళనకు గురి చేసింది.

మే మూడవ తేదీ తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను ఉరి వేసుకున్నారు. అతని బలవన్ మరణం పట్ల కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు, బంధు వర్గాల వారు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు.

రెండవ తేదీ రాత్రి వరకూ షూటింగ్ లో హుషారుగా పాల్గొన్న ప్రదీప్ తెల్లవారేసరికి విగతజీవిగా మారడం కలకలం రేపింది.

ప్రదీప్ కుటుంబం ఇటీవలే ఆ ఇంటికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు.

అయితే కాలనీవారితోగానీ, అపార్ట్ మెంట్ వాసులతో గానీ అతనికి పెద్దగా సంబంధాలు లేవని తెలుస్తోంది.

అతనికి గత ఏడాది సహనటి పావనిరెడ్డితో పెళ్లయ్యింది. ఇద్దరూ బాగానే ఉండేవారట.

ప్రదీప్ ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలు కారణం కాదని, కటుంబ కలహాలు కారణమా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

నార్సింగ్ పోలీసులు ఈ వ్యవహారంపై ప్రదీప్ భార్య పావనిరెడ్డితో మాట్లాడి ఆమె చెప్పిన వివరాలు రాసుకున్నారు.

Send a Comment

Your email address will not be published.