టి ఎస్ ఆర్ కాకతీయ కళా పరిషత్ అధ్వర్యంలో మహబూబ్ నగర్ లో జరిగిన కాకతీయ కళా వైభవ మహోత్సవ సభలో ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం గారికి “హాస్య నట బ్రహ్మ” బిరుదుని ప్రధానం చేసారు. ‘నా ఆధ్యాత్మిక గురువైన శ్రీ సుబ్బరామి రెడ్డి గారు ఒక పారిశ్రామిక వేత్తగా, ఒక రాజకీయ నాయకుడుగా, ఒక మానవతావాదిగా ఎంతో ఎత్తు ఎదిగి ఈ సినీవినీలాకసంలో ఎంతోమంది నటనా వైదూషకులున్నా నన్ను పిలిచి ఈ బిరుదుతో సత్కరించడం నా పూర్వ జన్మ సుకృతం” అని అన్నారు. కాకతీయులు పరిపాలించిన పుణ్య భూమి పై వారి పరిపాలనా ఔన్నత్యాన్ని తెలుగు గడ్డ గర్వపడేలా ప్రచారం చేసి మన తెలుగువారి గత వైభవాన్ని పునరుద్దరిస్తున్న శ్రీ సుబ్బరామి రెడ్డి గారు పురుషులందు పుణ్య పురుషులని కొనియాడారు.
ఈ కార్యక్రమానికి చిత్ర పరిశ్రమలోని పలువురు హాజరయ్యారు. వారిలో ప్రముఖులు జయప్రద, అలీ, బాబూ మోహన్, రాజశేఖర్, జీవిత, శివారెడ్డి వున్నారు. రాజకీయ ప్రముఖులు శ్రీ జూపల్లి కృష్ణారావు, జైపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, నంది ఎల్లయ్య, నిరంజన్ రెడ్డి మొదలగు వారున్నారు.