పరుగులు నేర్పించిన గురువుకి వయస్సు పైబడింది కూర్చుని వినోదం చూస్తున్నారు ఆయన ఆశీస్షులు నాతో పరుగులు తీస్తున్నాయి ———————————– ఎక్కిన పర్వతం ఓ కంకర రాయిగా మారి నా గుప్పెట్లో నిద్రపోతోంది ————————————– పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చిన చిన్నారి చేతిలోకి చేరిన సీతాకోకచిలుక బుద్ధిగా కూర్చుంది ———————————- జ్ఞాపకాలు ఎల్లప్పుడూ హృదయ ఆజ్ఞలను అనుసరిస్తాయి మారుమాట మాట్లాడక ———————————- మౌనం మీద రేకులు విచ్చుకున్న పువ్వు శబ్దం మౌనం కన్నా అందం |
నేను అనే మాట ముడుచుకుపోయి ఓ చుక్క అవుతుంది మనం అనే మాట విప్పారి ఆకాశమవుతుంది —————————— రాత్రి రహస్యంలా వినిపించే పాటను చీకటి పాడుతోంది నేను వింటున్నాను ——————————– నాలాగా మీరు ఏడవ లేరు మీలాగా నేను నవ్వ లేను ————————– ఆలోచనల నుంచి వచ్చే మాటలను మాట్లాడుతున్నాను వాటిలో ఎక్కడి నుంచో వచ్చే మాటలూ కలిసిపోతున్నాయి ——————————– దాదాపుగా చనిపోయాను ఈ ప్రాణం జీవిత చరమాంకంలో వెలుగురవ్వలు లేని సమాహారం ————————— యామిజాల జగదీశ్ |
భావవీచికలు
