భాస్కర భట్లకు పూరీ కలం కానుక

భాస్కర భట్లకు పూరీ కలం కానుక

ప్రముఖ గీత రచయిత భాస్కర భట్ల రవికుమార్ కు దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ మధ్య ఒక పెన్ను కానుకగా ఇచ్చారు. దాని పేరు మౌంట్ బ్లాక్. దీని ఖరీదు లక్షన్నర రూపాయలట. తన సినిమాలకు భాస్కర భట్ల మరింత మంచి పాటలు రాయాలన్న ఆశతో పూరీ జగన్నాథ్ ఈ విలువైన పెన్నుని కానుకగా ఇచ్చారు. అందుకు భాస్కర భట్ల ధన్యవాదాలు తెలుపుతూ హార్ట్ ఎటాక్ సినిమాలో  రాసిన పాటలను ప్రముఖంగా ప్రస్తావించారు.

ఇలా ఉండగా, పూరీ జగన్నాథ్ తన తల్లిని కంట తడిపెట్టించిన సంఘటనను చెప్పుకొచ్చారు.

పూరి జగన్నాథ్ తనకిష్టమైన అమ్మాయి లావణ్యను పెళ్లి చేసుకున్నారు. పూరి గారింట అమ్మాయిలూ లేరు కనుక తమ కుమారుడు జగన్నాథ్ పెళ్లిని వైభవంగా చెయ్యాలని అనుకున్నారు ఆయన పెద్దలు. కానీ పూరి తను ఇష్టపడిన అమ్మాయిని గుళ్ళో పెళ్లి చేసుకున్న తర్వాత తన తల్లికి ఫోన్ చేసి పెళ్లి విషయాన్ని చెప్పారట. ఆయన మాటలు విని తల్లి బోరున ఏడిచారు. కారణం, ఎన్నో ఏళ్ళ తర్వాత ఇంట్లో ఘనంగా చేద్దామనుకున్న పెళ్లిని తమ కుమారుడు ఇలా తమకు చెప్పకుండా చేసుకోవడంతో ఆమె బాగా బాధ పడ్డారట.

Send a Comment

Your email address will not be published.