మనం దర్శకుడితో మహేష్?

మనం దర్శకుడితో మహేష్?

ఇటీవల విడుదలై విజయవంతంగా ఆడుతున్న అక్కినేని ఫ్యామిలీ ఫిలిం మనం చిత్రం దర్శకుడు విక్రం కుమార్ తో కలిసి పని చెయ్యడానికి ప్రిన్స్ మహేష్ బాబు ఎంతో ఆసక్తి చూపుతున్నారని టాలీవుడ్ వర్గాల భోగట్టా.

మహేష్ బాబు కోసం దర్శకుడు, ఆయన బృందం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నట్టు సమాచారం.

మనం దర్శకుడు విక్రం, ఆయన టీంని పొగుడుతూ మహేష్ బాబు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆగడు చిత్రం షూటింగుతో బిజీగా ఉన్న మహేష్ బాబు ఆవెంటనే కోరట్ల శివ ప్రాజెక్ట్ చెయ్యవలసి ఉంది. ఆ చిత్రం తర్వాత కార్యరూపం దాల్చే పక్షంలో మణిరత్నం సారధ్యంలో మహేష్ బాబు ఒక చిత్రం చేసే అవకాశం ఉంది. మరో వైపు అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది మనం దర్శకుడు విక్రం కుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించే అవకాశాలు ఉన్నాయి.

Send a Comment

Your email address will not be published.