మహాకాలాయ గణపతి

మహాకాలాయ గణపతి

అగ్రపూజ్యాయ గణపతి, ప్రముఖాయ గణపతి
నీ సేవ క్షణములింక ఆరంభమోయ్
స్వదేశమా విదేశమా ఆలకింప పనిలేదోయ్
నీ పూజకు పృథివియంత ఒకేదేశమోయ్

ఆదిదేవాయ గణపతి, శశివర్ణాయ గణపతి
నిన్నుకొలువ సమయమింక ప్రారంభమోయ్
పగటి సూర్య కాంతి నీ మనోకావ్య తేజమోయ్
అర్ధరాత్రి చంద్రకాంతి అరుణతార బీజమోయ్

మహావీరాయ గణపతి, అపరాజితాయ గణపతి
నిన్ను మేలుకోలుప గడియలింక ప్రారంభమోయ్
ధర్మరక్షణ సైనికులకు శక్తి యుక్తి నీయవోయ్
కరోనాది తిమిరములను సంహరించవోయ్

మహాదేవాయ గణపతి, మహాకాలాయ గణపతి
నిన్ను తలువ కాలమింక ప్రారంభమోయ్
నమ్రతా భావంతో విధులను చేబట్టవోయ్
వినమ్రత గుణంతో కార్యము జయించవోయ్

–సూర్య (కాన్బెర్రా)

Send a Comment

Your email address will not be published.