‘మహా సముద్రం’లో ఏముంది

‘మహా సముద్రం’లో ఏముంది

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులుగా భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న చిత్రం ‘మహాసముద్రం’. ‘ఆర్‌ఎక్స్‌ 100’ తరువాత అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అదితి రావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ నాయికలు. దీపావళి కానుకగా థీమ్‌ పోస్టర్‌ అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. ఎర్రటి కాంతుల్లో సముద్రం చూపించి ఆసక్తి పెంచారు. ఓ వైపు తుపాకిపై ప్రేమ జంట నిల్చుని ఉండగా.. మరోవైపు శర్వాని పోలిన బ్రిడ్జ్‌పై ఓ వ్యక్తి పరిగెడుతూ దర్శనమిచ్చి అంచనాలు పెంచుతున్నారు. ఆ జంటలో ఒకరు ఓ దిక్కుకు.. మరొకరు ఇంకో దిక్కు చూస్తూ ఉండటంతో మరింత ఆసక్తి కలుగుంది. అన్ని రకాలుగా ఈ పోస్టర్‌ అందరిని ఆకర్షిస్తుంది. ‘నేను అలల కంటే మొండిగా ఉన్నాను.. సముద్రాల కంటే లోతుగా ఉన్నాను’ అని ట్వీట్‌ చేయడంతో ప్రేమ కోసం శర్వా ఏం చేశాడో తెలుసుకోవాలనే ఆశ పెరుగుతోంది. ఇదంతా చూస్తుంటే ప్రేమ, యుద్ధం నేపథ్యంలో సాగే కథలా అనిపిస్తుంది.

Send a Comment

Your email address will not be published.