మహేష్‌బాబుతో నటిస్తున్న అనన్య పాండే

మహేష్‌బాబుతో నటిస్తున్న అనన్య పాండే

Ananyaబాలీవుడ్‌ భామ అనన్య పాండే మొన్నటి వరకు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు దక్షిణాది వైపు అడుగులేస్తూ వస్తోంది. మహేష్‌బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కథానాయికగా కీర్తి సురేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో మరో కథానాయికగా అనన్య పాండే నటించనుందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ వార్తపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జీఎంబీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాకింగ్ రంగంలో ఆర్థిక మోసాల చుట్టూ చిత్ర కథ తిరుగుతోంది. ఇందులో కీర్తి సురేష్‌ బ్యాంక్‌ ఉద్యోగిగా కనిపించనుంది. చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తుండగా, పిఎస్‌ వినోద్‌ కెమెరామెన్‌గా, ఎడిటర్‌ మార్తాండ్‌.కె వెంకటేష్‌లు పనిచేయనున్నారు. ఇక అనన్య పాండే ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో కలిసి ఓ సినిమా చేస్తుంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది.

Send a Comment

Your email address will not be published.