మహేష్ హీరోగా...

మహేష్ హీరోగా...
సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో ఒక భారీ చిత్రం మొదలు కానుంది. ఈ విషయాన్ని మీవీ మేకర్స్ అధినేతలు అధికారికంగా వెల్లడించారు.
విదేశాల్లో ఎన్నో భారీ చిత్రాలను విడుదల చేసిన పంపిణీదారులు అయిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి  వీ ఎం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ “కొరటాల శివ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఆసక్తి కలిగింది. మా కాంబినేషన్ లో ఇదో మంచి చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది” అని చెప్పారు.
మిర్చి తర్వాత దర్శకుడిగా తనకిది రెండవ చిత్రమని కొరటాల శివ చెప్పారు. మహేష్ బాబుతో దర్శకుడిగా చేసే అవకాశం తనకు రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. యూత్, ఫ్యామిలీ, క్లాస్, మాస్, ఇలా అన్ని వర్గాలనూ ఆకట్టుకునే చిత్రంగా ఇది రూపొందుతుందని కొరటాల తెలిపారు.
మా సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న తొలి చిత్రం ఇదేనని, అందులోనూ మహేష్ తో కలిసి ఈ చిత్రం చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీప్రసాద్, చాయాగ్రహణం : మది.

Send a Comment

Your email address will not be published.