ముఖమే మనసుకు అద్దం

ముఖం మనసుకి అద్దం లాంటిదని అంటారు. ముఖంలో మనసులోని భావాలు పలుకుతాయని దాని అర్థం. ఈ సంగతేమో కానీ ఎదుటి వ్యక్తి మనకు తెలియకపోయినా, వాళ్ళని మనం మొదటిసారి చూస్తున్నా, వారి ముఖ ఆకృతిని బట్టి వారి మనస్తత్వం చెప్పేయవచ్చనేది కొందరి వాదన. ముఖ ఆకారానికి, వ్యక్తిత్వానికి మధ్య బలమైన సంబంధమే ఉందంటున్నారు వారు. ఇందులో నిజానిజాల సంగతి పక్కనపెడితే సరదాగా చదువుకోవడానికి మాత్రం బాగుంటుంది. వ్యక్తిత్వం అనేది చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల పెంపకం, మన అలవాట్లు, లక్షణాలు, చదువు సంస్కారాలు ఇంకా చాలా విషయాలపై ఆధారపడి ఉంటుందన్నది తెలిసిందే. అందుకే ఈ కింది వివరాలను చదువుకుని సరదాగా మీ ముఖాకృతికి అన్వయించుకోండి.

Mirror

గుండ్రని ముఖం
గుండ్రంగా, బొద్దుగా ముఖం కలిగిన వారు సున్నితమైనవారు, శ్రద్ధ చూపేవారు అయి ఉంటారు. వీరు బలమైన లైంగిక కోరికలు, ఫాంటసీలను కలిగి ఉంటారు. మీకు శాశ్వత ప్రేమ బంధం కావాలంటే గుండ్రటి ముఖం కలవారిని నిరభ్యంతరంగా ఎంపిక చేసుకోవచ్చట.

ముక్కోణపు ఆకారం
ముక్కోణపు ముఖాకృతి గలవారు సన్నని శరీరం కలిగి ఉంటారు. చాలా తెలివైన ఆలోచనలు చేస్తుంటారు. వీరు సృజనాత్మకంగా ఉంటారు. కాకపోతే వీరికి నిగ్రహం తక్కువ.

చదరంగా ఉంటే
స్క్వేర్‌ఫేస్‌ ఉన్నవారికి తెలివితేటలు ఎక్కువ. ఏ విషయంలోనైనా గందరగోళం లేకుండా స్పష్టత కలిగి ఉంటారు. వీరు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. అయితే దూకుడెక్కువ. అధికారం చెలాయించే తత్వం ఉంటుందట.

దీర్ఘచతురస్రాకారం
దీర్ఘ చతురస్రాకార ముఖం గలవారిలో పెత్తనం చేయాలనే ధోరణి ఉండదు. వీరు వ్యాపార, రాజకీయాలలో బాగా రాణిస్తారు. ఎల్లప్పుడూ సమతులంగా, నిష్పాక్షికంగా ఆలోచించగలుగుతారు. దేనికీ ఉద్రేకపడరు. వీరిలో ఉత్సాహర ఉరకలు వేస్తున్నా కొన్నిసార్లు సోమరితనంగా ఉంటారు.

గుడ్డు ఆకారం అయితే
వీరు అందమైన వ్యకిత్వం గలవారు. బ్యాలన్సింగ్‌గా ఉంటారు. వీరిలో మనుషులను ఒప్పించే, మెప్పించే లక్షణాలు ఎక్కువగా ఉండటం వలన వీరు మంచి దౌత్యవేత్తలుగా రాణిస్తారు. కానీ మానసికంగా బలహీనమైనవారు. శారీరకంగా కూడా అంత బలవంతులు కాదు.

ఫ్లాట్‌ నుదురు
నుదురు చదునుగా ఉన్న వ్యక్తులు ఏ పనినైనా చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. తద్వారా వచ్చిన ఫలితం ఏదైనా వాళ్లే బాధ్యత తీసుకుంటారు. వీరు రాబోయే పరిణామాలను ముందుగానే ఊహించి, మంచి నిర్ణయం తీసుకుంటారు.

రౌండ్‌ నుదురు
నుదురు గుండ్రని ఆకారంలో ఉన్నవారు కళాత్మక, సృజనాత్మక లక్షణాలు కలిగి ఉంటారు. కానీ నిజానికి వీరు ఆచరణాత్మకంగా ఉండరు. కొన్నిసార్లు వీరి ఆలోచనలు తర్కబద్ధంగా ఉండవు.

స్క్వేర్‌ నుదురు
చదరపు ఆకారంలో నుదురు ఉన్నవారు నిజాయితీగా ఉంటారు. న్యాయమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. సూటిగా ఉన్న వీరి కనుబొమలు ఈ లక్షణాలను చూపుతాయి.

నుదుటిపై గీతలు
నుదుటిపై గీతలు ఉన్నవారు ప్రకృతిని ప్రేమిస్తారు. ప్రకృతి పరిశోధనలు చేయడానికి చాలా ఇష్టపడుతుంటారు. నుదుటిపై అసలేమాత్రం గీతలు లేనివారిలో స్వార్థం పాళ్లు కాస్త ఎక్కువ

Send a Comment

Your email address will not be published.