మెల్బోర్న్ ఫెస్టివల్ కి 'మహానటి'

DgYQ0kwVQAEXzFu

మెల్బోర్న్ ఫెస్టివల్ కి ‘మహానటి’
– మూడు కేటగిరీల్లో ఎంపిక
– ఆగస్టు 10 నుంచి వేడుక

మెల్బోర్న్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి సాధారణంగా తెలుగు సినిమాలు రావడం అరుదు. ఈ సంవత్సరం రెండు సినిమాలు “రంగస్థలం” మరియు “మహానటి” ఎంపిక కావడం తెలుగువారందరికీ ఎంతో సంతోషకరమైన వార్త. అయితే మహానటి మూడు విభాగాల్లో పోటీపడడం మనదరికీ గర్వకారణం.

సావిత్రి జీవితచరిత్ర .. ‘మహానటి’గా తెరకెక్కి ఎంతోమంది అభిమానుల మనసులను కదిలించివేసింది. దర్శకుడిగా నాగ్ అశ్విన్ .. సావిత్రి పాత్రను పోషించిన కీర్తి సురేశ్ నూటికి నూరు మార్కులు కొట్టేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా ఘన విజయాన్ని సాధించి తన ప్రత్యేకతను చాటుకుంది. అలాంటి ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివెల్ ఆఫ్ మెల్ బోర్న్ కు నామినేట్ అయింది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఆగస్టు 10 నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది.

కీర్తి సురేశ్ ప్రధానపాత్రను పోషించిన ఈ సినిమా, ఉత్తమ చిత్రం .. ఉత్తమ నటి .. ఉత్తమ సహాయ నటి కేటగిరీల్లో పోటీపడుతోంది. ఈ విషయాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ .. ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘మహానటి’ విదేశాల్లోను ఆదరణ పొందుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఉత్తమనటి కేటగిరీలో దీపికా పదుకొనే (పద్మావత్) .. అలియా భట్ (రాజీ) .. రాణీముఖర్జీ (హిచ్ కీ) .. విద్యాబాలన్ (తుమ్హారీ సులు) తో కీర్తి సురేశ్ పోటీపడనున్నారు.

Send a Comment

Your email address will not be published.