యాక్షన్ సినిమాలవైపు

యాక్షన్ సినిమాలవైపు

యాక్షన్ సినిమాలవైపు అక్కినేని నాగార్జున

ఆరు పదుల వయస్సు దాటినా టాలీవుడ్‌ హీరో నాగార్జున 40ఏళ్లున్న వ్యక్తిగా కనిపిస్తుంటారనే విషయం తెలిసిందే. అయితే గతంలో రొమాంటిక్‌ ఎంటర్ టైనర్‌ మూవీస్‌ లో నాగార్జునను చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేసేవారు. మన్మథుడు-2 బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడంతో వయస్సుకు తగ్గట్టుగా తనకు సరిపోయే కథలను ఎంచుకుంటూ లవ్‌, రొమాంటిక్ బ్యాక్ డ్రాప్ సినిమాల నుంచి దూరంగా ఉంటున్నాడు నాగ్.

రొమాంటిక్‌ నుంచి యాక్షన్ పార్టు వైపు నాగ్ తన దృష్టిని మళ్లించాడు. ప్రస్తుతం నాగార్జున సోలొమన్ దర్శకత్వం వహిస్తున్న విల్డ్‌ డాగ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఎన్‌ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు గరుడ వేగ ఫేం ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వగా..ఈ ప్రాజెక్టులో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. యాక్షన్ డ్రామ నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు టాక్‌. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర చిత్రంలో కీలక పాత్ర పోష్తిన్నాడు.

Send a Comment

Your email address will not be published.