రభస ఆడియో విడుదల వాయిదా

రభస ఆడియో విడుదల వాయిదా

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న రభస చిత్రం ఆడియో విడుదల వాయిదా పడింది. ముందు అనుకున్న ప్రకారం ఈ ఆడియో సంబరాలు ఈ నెల 27వ తేదీన జరగవలసి ఉంది. అయితే హైదరాబాదులోని శిల్ప కళా వేదిక ఆనాటికి లభించక పోవడంతో ఈ ఆడియో విడుదలను ఆగస్ట్ ఒకటో తేదీకి వాయిదా వేసినట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చారు.

రభస ఆడియో విడుదల కార్యక్రమాన్ని తమన్ ఓ ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. అది ప్రేక్షకుల మదిలో కలకాలం గుర్తు ఉండిపోయేలా ఉండాలని తమన్ ఆశిస్తున్నారు.

ఈ చిత్రానికి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ సన్నివేశాలను వినోదాత్మకంగా తీయడంలో శ్రీనివాస్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ సరసన సమంతా నటిస్తున్నారు. ప్రణీత కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఈ చిత్రానికి హైలైట్ అని యూనిట్ వర్గాల మాట.అందుకే జూనియర్ ఎన్టీఆర్ సీన్లను బ్రహ్మానందంతో కలిసి ప్రత్యేకించి ప్రమోట్ చేస్తున్నారు.

ఈ సినిమాను వచ్చే నెల 21న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Send a Comment

Your email address will not be published.